Technology News : మారుతున్న కాలానుగుణంగా ప్రస్తుతం మనకు అన్నీ సులభంగా దొరుకుతున్నాయి. మనకు తెలియని ప్రదేశంలో అడ్రస్ ను వెతకడం కోసం గతంలో చాలా పాట్లు పడేవాళ్లం. అయితే టెక్నాలజీ అందుబాటు లోకి రావడం, గూగుల్ మ్యాప్స్ వంటి వర్చువల్ మ్యాప్ మన ఫోన్‌లో ఉండటంతో ఈ సమస్యలు దూరమయ్యాయి. ఇంటర్నెట్ సాయంతో క్షణాల్లోనే మనకు కావల్సిన ప్రదేశాల వివరాలను తెలుసుకుంటున్నాం. ఈ సేవలను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చేందుకు మ్యాప్స్‌లో కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది గూగుల్. మ్యాప్ లొకేషన్ మార్క్‌లో ప్లస్ కోడ్‌తో ఫుల్ అడ్రస్ యాడ్ చేసే ఆప్షన్‌ను గూగుల్ మ్యాప్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లస్ కోడ్‌తో మన హోమ్ అడ్రస్‌ను మరింత సులభంగా ఇతరులకు షేర్ చేయవచ్చు. ఇంతకు ముందులా మన అడ్రస్‌ను పూర్తి వివరాల (హౌస్ నంబర్, స్ట్రీట్ నేమ్)తో కాకుండా కేవలం ఆరు నుంచి ఏడు అక్షరాలతో గుర్తించి ఇతరులకు షేర్ చేయవచ్చు.
ప్లస్ కోడ్స్ అనేవి ఆరు నుంచి ఏడు అక్షరాలతో ఉన్న కోడ్. ఈ కోడ్ తర్వాత సిటీ పేరు, రాష్ట్రం పేరు ఉంటుంది. గతంలోలాగా అడ్రస్‌లో స్ట్రీట్ పేరు, ల్యాండ్ మార్కులు కనిపంచవు. అక్షాంశాలు, రేఖాంశాల ద్వారా మన హోమ్ అడ్రస్‌ను గూగుల్ ప్లస్ కోడ్స్‌లోకి మారుస్తుంది. ఉదాహరణకు మీరు హైదరాబాద్‌లోని పంజాగుట్ట ప్రాంతంలో ఉన్నారనుకుందాం. గతంలో అయితే ఇంటి అడ్రస్‌ను హోమ్ అడ్రస్‌గా పెట్టుకోవాలంటే ఇంటి నంబర్, కాలనీ పేరు, ల్యాండ్ మార్క్ మొదలైనవి టైప్ చేయాల్సి ఉండేది. కానీ ప్లస్ కోడ్స్ అందుబాటులోకి రావడంతో PRS+2AS హైదరాబాద్, తెలంగాణ అని మాత్రమే ఉంటుంది. ఫలితంగా మీరు సులభంగా మీ హోమ్ అడ్రస్‌ను ఇతరులకు షేర్ చేయవచ్చు.
ఈ ప్లస్ కోడ్‌ను 2018లోనే భారత్‌లో ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు కొన్ని ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలకు, ఎన్‌జీవో(NGO)లకు మాత్రమే పరిమితం చేశారు. అయితే దేశంలో దాదాపు 3 లక్షల జనాభా కంటే పైగా ప్రస్తుతం ఈ ప్లస్ కోడ్స్‌ను వాడుతూ తమ అడ్రస్‌ను ఈ కామర్స్, ఫుడ్ డెలివరీ యాప్స్ వంటి వాటిలో షేర్ చేస్తున్నట్లు తెలిసిందని గూగల్ మ్యాప్స్ ప్రొడక్ట్ మేనేజర్ అమండా బిషప్ పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో మాత్రమే ఈ సర్వీస్ అందుబాటులో ఉందని త్వరలోనే ఐఓఎస్‌లో కూడా అందుబాటులోకి తెస్తామని అమండా పేర్కొన్నారు.
ప్లస్ కోడ్స్‌తో ప్రయోజనాలు :
- ప్లస్ కోడ్స్‌లో మీ అడ్రస్ షార్ట్‌గా ఉంటుంది… దాంతో వేగంగా మీ అడ్రస్‌ను ఇతరులకు షేర్ చేయవచ్చు.
- మీ అడ్రస్ పెద్దగా ఉండకపోవడంతో రిసీవ్ చేసుకున్న వారు సులభంగా మీరు ఎక్కడ ఉన్నారో అని తెలుసుకోగలరు.
- ఇది ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో పని చేస్తుంది. దాంతో నెట్ లేకపోయినా ప్లస్ కోడ్స్ ద్వారా మీ లొకేషన్‌ను షేర్ చేయవచ్చు.