PM KISAN : రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ 11 వ ఇన్స్టాల్ మెంట్ కు వారు మాత్రమే అర్హులు..?

PM KISAN:ప్రధానమంత్రి సమ్మాన్ నిధి యోజన కింద రైతుల అభివృద్ధి కోసం ప్రతి ఏడాది ఆరు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో ఇన్స్టాల్మెంట్ రూపంలో జమ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే పది విడతలలో డబ్బులు జమ చేశారు. అయితే పదకొండవ విడత జూలై నెలలో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే రైతులకు కేంద్ర ప్రభుత్వం పలు విషయాలను సూచించారు.ఇక ఈ పదకొండవ విడతలో భాగంగా కిసాన్ డబ్బులు అందరికీ కాకుండా కేవలం కొంత మంది రైతులకు మాత్రమే జమ కానున్నట్లు వెల్లడించారు.

ఎవరైతే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకొని ఉంటారో వారికి మాత్రమే పదకొండవ విడతలో భాగంగా పీఎం కిసాన్ నిధి డబ్బులు జమకానున్నాయి. ఇక ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయని రైతులకు డబ్బులు ఈ విడతలో జమకావు. అందుకే రైతులు వెంటనే ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ కేవైసీ ప్రక్రియను మే 31 2022 లోగా పూర్తి చేయాలి. ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం కోసం https://pmkisan.gov.in/ లో ఇ-కేవైసీ నిలిచిపోయింది. రైతులు బయోమెట్రిక్ ఆథెంటికేషన్ కోసం సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లాలి.

Advertisement

ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఇ-కేవైసీ అప్‌డేట్ చేసే అవకాశం లేదు కాబట్టి రైతులు కామన్ సర్వీస్ సెంటర్‌లో 2022 మే 31 లోగా ఇ-కేవైసీ చేయించాలి.ఈ విధంగా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే 11 వ విడత పీఎం కిసాన్ నిధి డబ్బులు వారి ఖాతాలో జమ కానున్నాయి. ఇలా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయని పక్షంలో ఈ విడత డబ్బులు రైతులు కోల్పోవాల్సి వస్తుంది. ఈ ప్రక్రియ మే 31లోగా చేయించుకోవాలి.

Advertisement