Amazon prime : అమెజాన్ ప్రైమ్ డే సేల్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈనెల 23వ తేదీన ప్రైమ్ డే సేల్ మొదలుకానుంది. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, టీవీలతో పాటు అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పై డిస్కౌంట్లు ఉండనున్నాయి. ఇతర వస్తువులు కూడా మంచి డిస్కౌంట్ తో అందించనుంది అమెజాన్. కొన్ని వస్తువులపై 85 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. కేవలం రెండు రోజులే ఈ సేల్ ఉంటుంది. అంటే ఈనెల 23న ప్రారంభమై 24వ తేదీ వరకు కొనసాగుతుంది.
Amazon prime : అమెజాన్ ప్రైమ్ బెనిఫిట్స్….
అయితే ఈ ప్రైమే డే సేల్ కేవలం ప్రైమ్ మెంబర్ షిప్ ఉన్నవారికి మాత్రమే. ఇందులో ప్రైమ్ మెంబర్లకు అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయి. కొత్తగా ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకున్న వారికి కూడా ఈ డిస్కౌంట్లు వర్తించనున్నాయి. ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ తీసుకుంటే.. ప్రైమ్ ఓటీటీతో పాటు షాపింగ్ లో ఫాస్ట్ అండ్ ఫ్రీ డెలివరీ ఉంటుంది. మ్యూజిక్ ఫ్రీగా వినవచ్చు.
- ప్రైమ్ నెలవారి ప్లాన్: ఈ ప్లాన్ ధర కేవలం రూ.179 మాత్రమే. నెలపాటు ప్రైమ్ మెంబర్లుగా కొనసాగవచ్చు.
- ప్రైమ్ 3 నెలల ప్లాన్: ఈ 3 నెలల ప్లాన్ ధర రూ.459. అంటే నెలకు రూ.153 మాత్రమే.
- ప్రైమ్ సంవత్సరం ప్లాన్: ఈ ప్లాన్ ధర కేవలం రూ.1,499 మాత్రమే. అంటే నెలకు సుమారు రూ.125 అవుతుంది. సంవత్సరం పాటు ప్రైమ్ మెంబర్లుగా కొనసాగవచ్చు. ఎక్కువ కాలం ప్రైమ్ మెంబర్ షిప్ ఆస్వాదించాలనుకునే వారికి ఈ ప్లాన్ ది బెస్ట్ అనే చెప్పాలి.
- ప్రైమ్ సబ్ స్క్పిప్షన్ తీసుకున్న వారు అమెజాన్ ప్రైమ్ వీడియోలో సినిమాలు, వెబ్ సిరీస్ లు, షోలు చూడవచ్చు. అలాగే అమెజాన్ షాపింగ్ చేసే వారికి ఉచితంగా, వేగంగా డెలివరీ చేస్తారు. ప్రత్యేకమైన సేల్స్ ఉన్న సమయంలో మెంబర్ షిప్ ఉన్న వాళ్లు ఒకరోజు ముందుగానే సేల్ లో పాల్గొనవచ్చు. ప్రైమ్ మ్యూజిక్, ప్రైమ్ రీడింగ్ ను ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు.
Read Also : Amazon Prime : అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన అమెజాన్… కానీ వారికి మాత్రమే !