Ys Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమైన విషయం ఉంటే తప్ప మీడియా ముందుకు రారు. ఇప్పుడనే కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం అంతే.. అధికారం ఉన్న లేకున్నా ఆయన ఎప్పుడు ఒకేలా రియాక్ట్ అవుతారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలపై సీరియస్ అయినంతలా మీడియా ముందు కారు. చాలా కూల్‌గా మాట్లాడతారు. అదే ఆయనకు ప్లస్ పాయింట్.
చాలా కూల్‌గా సమస్యను పరిష్కరించడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన ఒక అంశాన్ని తీసుకుని దాని గురించే మాట్లాడతారు తప్పితే వేరే వాటి గురించి ప్రస్తావించరు. ఆయన మాట్లాడిన మాటలపై కౌంటర్ వేయాలన్నా ఎదుటి వారికి చాలానే సమయం కావాలి. కానీ తాజాగా ఆయన నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడిన మాటలు.. ప్రతిపక్షాలు విమర్శించే చాన్స్ ఇచ్చేట్టు చేశాయి.
జగన్‌పై టీడీపీ నేత విమర్శలు చేసిన నేపథ్యంలో జగన్ అభిమానులు, కార్యకర్తలు సదురు టీడీపీ నేత ఇంటిపై, పార్టీ కార్యాలయంపై దాడి చేసిన విషయం తెలిసిందే. దీనిపై జగన్ తాజాగా స్పందించారు. ఈ సారి ఆయన మాట్లాడిన మాటలు భిన్నంగా అనిపించాయి. తాము ఎప్పుడైనా బూతులు మాట్లాడామా? ఘాటు వ్యాఖ్యలు చేశామా? అంటూ ప్రశ్నించారు. దీంతో గతంలో ఆయన పలువురు నేతలపై చేసిన బూతు వ్యాఖ్యలు గుర్తుకు వచ్చేలా చేశారు.
Read Also : Huzarabad-Badwel ByPoll : హుజూరాబాద్‌లో పార్టీలు ఇలా.. బద్వేల్‌లో అలా.. విచిత్ర రాజకీయాలు
చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఆయన్ను ఉరి తీయాలని, కాల్చి చంపాలని చేసిన వ్యాఖ్యలను జగన్ మర్చిపోయి ఉంటారని పలువురు విమర్శిస్తున్నారు. టీడీపీ నేతలు తిట్టారని తన అభిమానులు స్పందించి ఇలా చేశారని అంటున్నారు కానీ, తర్వాతి రోజుల్లో వైసీపీ నేతలు టీడీపీ నేతలను తిడితే వారి అభిమానులను సైతం ఇలాగే ప్రవర్తిస్తే పరిస్థితి ఏంటని, అప్పుడు కూడా ఇలాగా ప్రశాంతంగా స్పందిస్తారా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
తాను మాట్లాడిన మాటలను, తిట్లను, ప్రవర్తనను జగన్ మర్చిపోయి ఇలా మాట్లాడుతున్నారని, వాటిని గుర్తుకు తెచ్చుకుంటే ఆయన మాట్లాడినవి ఘాటు వ్యాఖ్యలు, బూతులు అవునో కాదో ఆయనకే తెలుస్తాయని పలు విమర్శలు వినిపిస్తున్నాయి.
Read Also : KTR Next CM : సీ సర్వే ఎఫెక్ట్.. కేటీఆర్ నెక్ట్స్ సీఎం?
Tufan9 Telugu News providing All Categories of Content from all over world