Minister RK Roja : వైసీపీ ఫైర్ బ్రాండ్ గా పెరొందిన ఎమ్మెల్యే రోజూ ఎట్టకేలకు తన కలను నెరవేర్చుకున్నారు. 23 ఏళ్ల రాజకీయ జీవితంలో మొదటి సారిగా అమాత్య యోగం దక్కింది. చేసిన పూజలు, మొక్కిన మొక్కులు అన్నీ ఫలించాయి. అయితే ఇన్నాళ్లూ ఎమ్మెల్యేగా పిలిపించుకున్న ఆమె మొదటి సారిగా మంత్రిగా పిలిపించుకోబోతోంది. ఎమ్మెల్యేగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూనే… రాజకీయాల పరంగా ప్రత్యర్థి పార్టీలపై తనదైన శైలిలో కామెంట్లు చేస్తుంటారు. అందుకే ఆమెకు ఫైర్ బ్రాండ్ గా పేరొచ్చింది.
అయితే గతంలో మంత్రి పదవి కోసం ఆమె ఆశగా ఎదురు చూపినప్పటికీ.. ఆమె ఆశ ఫలించలేదు. అయితే తాజాగా మంత్రి పదవిలో ఆమెకు స్థానం లభించింది. దీంతో ఆమె సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నారట. ఇక జబర్దస్త్ లాంటి షోలకు వెళ్లకుండా కేవలం ప్రజా సేవలోనే కొనసాగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు పదేళ్లుగా రోజా జబర్దస్త్ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే మంత్రి వంటి బాధ్యాయుతమైన పదవిలో ఉండి.. కామెడీ షోలు చేయడం సరికాదని భావించినట్లు తెలుస్తోంది. అందుకే ఆమె ఇక టీవీలు, సినిమాల్లో కనిపించకూడదని నిర్ణయం తీసుకున్నారట.
Read Also : Ap cabinet: నాని పోయాడు.. కేబినెట్ లోకి కొత్త ఫైర్ బ్రాండ్లు వచ్చారు..