Ap Cabinet : ప్రతిపక్ష నేత చంద్రబాబు, నారా లోకేష్ అంటే ఓ రేంజ్ విరుచుకుపడతారు కొడాలి నాని. మైక్ దొరికిందంటే మాటల తూటాలు పేలుస్తారు. జగన్ జట్టులో కొడాలి ఒక ఫైర్ బ్రాండ్ అనే చెప్పాలి. తను మంత్రి పదవిలో ఉన్నాను కాబట్టి కొద్దిగా తగ్గి మాట్లాడుతున్నానని… ఒకవేళ ఏ మంత్రి పదవీ లేకపోతే తన మాటల దాడి మాములుగా ఉండదని చివరి కేబినేట్ తర్వాత అన్నారు కొడాలి నాని.
ఇప్పుడు కొత్త మంత్రివర్గంలో నాని లేకపోవడంతో ఆయన ప్రతిపక్ష నేతలు ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ పై ఎలా విరుచుకుపడతారో చూడాలి. అయితే కేబినెట్లో నాని లేకపోయినా.. ఆయన స్థానంలో ఇద్దరు ఫైర్ బ్రాండ్లకు సీఎం జగన్ అవకాశమిచ్చారు. ఒకరు నగరి ఎమ్మెల్యే రోజా, మరొకరు సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు. కేవలం బాబు టార్గెట్ గానే ఈ ఇద్దరికీ చివరి నిమిషంలో అవకాశం ఇచ్చారనే ప్రచారం ఉంది. ఒకరికి ఇప్పుడు ఇద్దరు అయ్యారు. మరి విమర్శల స్థాయి ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.
రోజా సుదీర్ఘ కాలం టీడీపీలో పని చేశారు. ఎమ్మెల్యేగానూ అవకాశం దక్కలేదు. 2014లో తొలి సారి ఎమ్మెల్యే అయిన తర్వాత టీడీపీని టార్గెట్ చేసే క్రమంలో టీడీపీ మంత్రులకు రోజా లక్ష్యమయ్యారు. శాసనసభ నుండి ఏకంగా ఏడాది పాటు రోజా టీడీపీ హయాంలో సస్పెండ్ అయ్యారు. ఇక ఇప్పుడు అదే శాసనసభలో రోజా మంత్రిగా అడుగు పెట్టనున్నారు. కానీ చంద్రబాబు వచ్చే ఎన్నికల వరకు అసెంబ్లీకి వచ్చే ఛాన్స్ లేదు.
కేవలం విమర్శలకే కాదు.. ఈ సారి కుప్పం పైనా జగన్ ఫోకస్ చేశారు. పెద్దిరెడ్డి, సుదీర్ రెడ్డిలకు తోడుగా రోజా కూడా రంగంలోకి దిగితే బాబుపై మరింత ఒత్తిడి పెంచవచ్చని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే బాబు సామాజిక వర్గానికి చెందిన వారు ఈసారి కేబినెట్ లో ఒక్కరు కూడా లేరు. దీని వెనక జగన్ వ్యూహమెంటో చూడాలి. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఓడించిన భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు మంత్రి పదవి వస్తుందని అంతా అనుకున్నా.. పదవి మాత్రం దక్కలేదు. పీకేపై విరుచుకుపడే మంత్రులు పేర్నినాని, కన్నబాబులను కేబినెట్ నుండి తొలగించారు. అంటే పవన్ ను జగన్ లైట్ తీసుకున్నారా అనే చర్చ నడుస్తోంది.
Read Also : Minister RK Roja : ఎమ్మెల్యే రోజాకు మంత్రి పదవి.. జబర్దస్త్ షో, సినిమాలకు గుడ్‌బై..!