...

Minister nirmala sitaraman: క్రిప్టో కరెన్సీతో ప్రమాదమే.. ఉగ్ర నిధులకు వాడే అవకాశం ఉంది!

భారత్‌లో క్రిప్టో కరెన్సీ మార్కెట్‌పై అనిశ్చితి కొనసాగుతోన్న వేళ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ కరెన్సీ వినియోగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిప్టోలను మనీ లాండరింగ్‌, ఉగ్ర వాదులకు నిధులను సమీకరించేందుకు ఉపయోగించే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీతారామన్‌ ఓ సెమినార్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘క్రిప్టోలతో అన్ని దేశాలకు ఉన్న అతిపెద్ద ముప్పు ఇదే. మనీలాండరింగ్‌, ఉగ్రవాదానికి ఆర్థిసాయం చేయడానికి ఈ కరెన్సీని ఉపయోగించే అవకాశాలున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి సాంకేతికతతో కూడిన నియంత్రణ అవసరమని భావిస్తున్నా. అయితే ఇది కేవలం ఏ ఒక్క దేశమో నిర్వహించడం అనేది అసాధ్యం. బోర్డు(అంతర్జాతీయ ద్రవ్యనిధి)లోని అన్ని దేశాలు సమన్వయం చేసుకోవాలి’ అని నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.కొవిడ్‌ మహమ్మారి సమయంలో భారత్‌లో సాంకేతిక వినియోగం పెరిగిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రేటు 64శాతం ఉంటే భారత్‌లో సాంకేతిక వినియోగం రేటు 85శాతంగా ఉందన్నారు. సామాన్య ప్రజలు సైతం దీన్ని సమర్థంగా ఉపయోగించుకుంటున్నట్లు తెలిపారు.