...

Minister Balineni : ఉద్యోగుల విషయంలో సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారు : మంత్రి బాలినేని

Minister Balineni : ఉద్యోగుల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని ఏపీ విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి అన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే ఉద్యోగులు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు వ్యతిరేకం కాదన్నారు. జగన్ సీఎం అయిన వెంటనే 27 శాతం ఐఆర్ ఇచ్చారని, ఇది చరిత్రలో ఎప్పుడు ఇలా జరగలేదన్న విషయాన్ని ఉద్యోగులు గుర్తు చేసుకోవాలన్నారు. గత రెండేళ్లుగా కరోనా వల్ల రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు పడిన విషయాన్ని ఉద్యోగులు గుర్తించాలన్నారు.

మరో వైపు విద్యుత్ ఉద్యోగుల విషయంలో సీఎంతో మాట్లాడిన తర్వాత ఒకేసారి నాలుగు డిఏలు ఇచ్చామన్నారు. విద్యుత్ శాఖలో పీఆర్సీపై మార్చిలో వేయాల్సిన కమిటీని ఇప్పుడే వేశామన్నారు. అలాగే, మిగిలిన ఉద్యోగుల సమస్యలు త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బాలినేని తెలిపారు. మరో వైపు, కొత్త జిల్లాల ఏర్పాటుపై కూడా ఆయన స్పందించారు. మార్కాపురం కేంద్రంగా జిల్లా కావాలని కోరుతున్నారని, కేవలం పార్లమెంట్ సెగ్మెంట్ ఆధారం గానే జిల్లాల పునర్విభజన చేపట్టారని మంత్రి స్పష్టం చేశారు.

minister-balineni-sreenivasulu-respond-about-prc-issue
minister-balineni-sreenivasulu-respond-about-prc-issue

ప్రాంతాలవారీగా పునర్విభజన చేపట్టే అవకాశం ఉంటే రాష్ట్రంలో మొట్టమొదటిగా మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే కందుకూరులో రెవెన్యూ డివిజన్ కొనసాగించే విషయంలో సీఎంతో మాట్లాడామని, ఏం చేయాలనేది త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. జిల్లాకు సంబంధిచిన సమస్యలు, అభివృద్ది కార్యక్రమాలపై రేపు ముఖ్యమంత్రితో భేటి కానున్నామని, ఈ సమావేశంలో సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్ళి సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి బాలినేని స్పష్టం చేశారు.

Read Also : Devotional News : ఎంత కష్టపడ్డా ఇంట్లో డబ్బు సమస్య ఉంటుందా… అయితే ఇవి పాటించండి !