CM kcr : పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి రెండేళ్లు పెంచుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ప్రకటన విడుల చేసింది. గతంలోనే మూడేళ్లు పొడిగించిన తెలంగాణ సర్కారు మరోసారి రెండేల్లు పొడగిస్తూ నిర్మయం తీసుకుంది. ఇలా మొత్తం ఐదేళ్లు పెంచినట్లు అయింది. అయితే రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితమే పోలీసు శాఖలో 17 వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు అవ్వాలనే నిబంధన తీసుకు రావడంతో వయోపరిమితి పెంచాలని నిరుద్యోగులు, నిరుద్యోగ సంఘాలు నిససనలు తెలియజేశాయి. ఈ వి,యాన్ని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా… పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి పెంచుతూ… ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ కు సంబంధించి దాదాపు 11 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో మహిళా అభ్యర్థుల నుంచి 2.4 లక్షల దరఖాస్తులు రావడం గమనార్హం. అయితే సీఎం కేసీఆర్… ఉద్యోగ వయోపరిమితి పెంచడంతో అప్లికేషన్లు మరో రెండు లక్షలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పోలీసు శాఖ ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండు సంవత్సరాలు పొడిగిస్తూ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు.
— Telangana CMO (@TelanganaCMO) May 20, 2022
Read Also : TS Police recruitment: పోలీసు ఉద్యోగాల దరఖాస్తుకు గడువు పెంపు..!