...

Jana Reddy Sons : ప్రత్యక్ష రాజకీయాల్లో జానారెడ్డి కుమారుల ఎంట్రి..? ఎక్కడి నుంచి పోటీ చేస్తారంటే..?

Jana Reddy Sons : తెలుగు రాష్ట్రాల్లో జానారెడ్డి పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతగా ఆయన పేరు సంపాదించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీతో పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేసిన జానారెడ్డి.. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న టైంలో ట్రాన్స్ పోర్ట్ మినిష్టర్ గా సేవలందించారు. కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ లో చేరిన ఆయన.. వైఎస్సార్ సీఎంగా ఉన్న టైంలో పలు మంత్రి పదవులు దక్కించుకున్నారు. హోం మినిస్టర్ గా సైతం సేవలందించారు. అప్పట్లో వరుస విజయాలతో దూసుకుపోయిన జానారెడ్డి స్పీడ్ ప్రస్తుతం తగ్గిందనే చెప్పాలి. 2018లో అసెంబ్లీ ఎన్నికల టైంలో నాగార్జున‌సాగర్ నుంచి పోటీచేసిన ఆయన ఓడిపోయారు. వాస్తవానికి ఆ నియోజకవర్గం ఆయనకు కంచుకోట. కానీ అక్కడ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి నోమలు నర్సింహయ్య గెలుపొందారు.

అనంతరం నర్సింహయ్య చనిపోయాక ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానంతో గొడవపడి మరీ టికెట్ దక్కించుకున్నాడు జానారెడ్డి. కానీ టీఆర్ఎస్ తరపున నర్సింహయ్య కుమారుడు భగత్ పోటీచేసి జానారెడ్డిపై విజయం సాధించాడు. అయితే ప్రత్యక్ష రాజకీయాలను ఇక తానుదూరంగా ఉంటానని జానా ప్రకటించారని టాక్. అయితే ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించేందుకు తన కుమారులను సిద్ధం చేసుకుంటున్నాడు.

రెండో కుమారుడు జైవీర్ ఇప్పటికే నాగార్జున సాగర్ శాసనసభ నియోజకవర్గంలో పర్యటనలు స్టార్ట్ చేశారు. లీడర్లందరికీ టచ్ లో ఉంటున్నారు. పెద్ద కుమారుడు రఘువీర్ మిర్యాలగూడ నియోజకవర్గంపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. 2018 ఎన్నికల్లోనే మిర్యాలగూడ నుంచి రఘువీర్ కు టికెట్ దక్కాల్సింది. కానీ ఒక ఫ్యామిలీకి ఒకే టికెట్ అంటూ రాహుల్ గాంధీ చెప్పడంతో ఆయనకు పోటీ చేసే చాన్స్ రాలేదు. అయితే ఈ రెండు నియోజకవర్గాలపై జానాకు మంచి పట్టుంది. ఫాలోయింగ్ సైతం ఎక్కువే. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన కుమారులకు టికెట్ వస్తే గెలిచేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు.

Read Also : JR NTR : టీడీపీ స్కెచ్ అదేనా? అందుకే జూనియర్ ఎన్టీఆర్‌పై కామెంట్స్ చేశారా?