JR NTR : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పరిస్థితి మరి దారుణంగా ఉంది. అసలే వరుస ఓటములతో సతమతమవుతున్న ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు.. సొంత పార్టీ నేతలు సైతం షాక్ ఇస్తున్నారు. ఇందుకు ప్రత్యేక ఉదాహరణగా ఎమ్మెల్యే వంశీ గురించి చెప్పుకోవచ్చు. ఆయన టీడీపీ పార్టీ నుంచి గెలిచినా.. వైసీపీకి అనుకూలంగా మారి తెలుగుదేశం పార్టీ పైనే విమర్శలు చేయడం మొదలుపెట్టారు. దీంతో పరిస్థితి ఏంటని చంద్రబాబుకు అంతుచిక్కలేదు. ఆయనపై చర్యలు తీసుకునేందుకు సైతం ముందడుగు వేయలేకపోతున్నారు.
ఇక దీనికి తోడు ఇటీవల అసెంబ్లీ జరిగిన పరిణామాలు.. చంద్రబాబు ఫ్యామిలీపై వైసీపీ వ్యాఖ్యలు.. ఇవన్నీ తెలిసినవే. అయితే ఈ టైం ప్రెస్ మీట్ పెట్టిన చంద్రబాబు.. వైసీపీ చేసిన వ్యాఖ్యలను మీడియాకి వివరిస్తూ కంటతడి పెట్టుకున్నారు. ఈ ఘటనతో ఆ పార్టీ నేతలంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఇక దీనిని అడ్డుకుపెట్టుకుని పార్టీ మైలేజ్ పెంచుకోవడానికే నందమూరి ఫ్యామిలీతో వైసీపీకి వార్నింగ్‌లు ఇప్పించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇక జూనియర్ ఎన్టీఆర్‌పై నాయకులు కామెంట్స్ చేయడంతో చర్చ పెరిగింది. ఎన్టీఆర్ ను అడ్డుపెట్టుకుని టీడీపీ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నదనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ పార్టీకి ఫైర్ బ్రాండ్ గా మారి వైసీపీపై హాట్ కామెంట్స్ చేస్తే.. ఆ అగ్గిలో టీడీపీ చలికాచుకునేందుకు యత్నించిందన్న వాదనలు లేకపోలేదు. అయితే అసెంబ్లీ ఘటనపై నారాలోకేశ్ సైతం స్పందించిన తీవ్రస్థాయిలో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
ఇప్పటికే సినీ కెరీర్ పై సీరియస్ గా ఫోకస్ చేస్తున్న ఎన్టీఆర్.. ఇప్పుడు టీడీపీ పార్టీకి దిక్కయ్యాడా? పార్టీపైనే ఫుల్ ఫోకస్ పెట్టి రాజకీయ చదరంగంలో ఇరుక్కుంటాడా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ ను అడ్డుపెట్టుకుని టీడీపీ లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తే ఆ పార్టీకి మరింత నష్టం వాటిళ్లక తప్పదని అంటున్నారు పోలిటికెల్ ఎక్‌పర్ట్స్.
Read Also : Ys Jagan : ఏపీలో ఏం జరగబోతోంది..? వైసీపీని నవరత్నాలు సేవ్ చేస్తాయా..?
Tufan9 Telugu News providing All Categories of Content from all over world