CM YS Jagan Cabinet : ఏపీలో వైసీపీ ప్రభుత్వం కొలువు దీరిన తొలినాళ్లలోనే సీఎం జగన్ మంత్రివర్గ విస్తరణ గురించి స్పష్టంగా చెప్పారు. సరిగ్గా రెండున్నరేళ్ల తర్వాత ప్రస్తుత మంత్రుల పనితీరుపై రివ్యూ చేసి కొత్త వారికి చాన్స్ ఇస్తానన్నారు. వైసీపీ ప్రభుత్వం కొలువుదీరి ఇప్పటికీ రెండున్నరేళ్లు గడిచిపోయింది. 2024 వచ్చే ఎన్నికల కోసం సీఎం జగన్ ఇప్పటికే కసరత్తును ప్రారంభించారు. రెండోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. కానీ, ఇప్పటివరకు మంత్రివర్గ విస్తరణ జరగలేదు. కొత్త వారికి అవకాశం కల్పించలేదు. ఈ టాపిక్ రాగానే వైసీపీ మంత్రుల్లో ఏదో తెలియని అలజడి మొదలవుతుందని సమాచారం.
త్వరలోనే తమంతా మాజీ మంత్రులం అవుతామని ఆందోళనలో ఉన్నారట. వారి ముఖంలో నవ్వు కూడా మాయం అయ్యిందని కొందరు అంటున్నారు. దీంతో వారు చూసే శాఖల పట్ల కూడా నిబద్ధతగా పనిచేయలేకపోతున్నారని తెలిసింది. అయితే, ఇప్పటివరకు మంత్రివర్గ విస్తరణ గురించి అటు మీడియాలో, ఇటు హై కమాండ్ నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో కొంత రిలాక్స్‌గా ఉన్నారట. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ క్యాబినెట్ విస్తరణపై పెద్దగా ఆసక్తి చూపిడం లేదని తెలిసింది.
2019 మే 31న జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యలు చేపట్టాక ఇప్పటివరకు పూర్తిగా బడ్జెట్ సమావేశాలు జరగలేదు. దీంతో 2022లో మాత్రం నెల రోజులు పక్కాగా బడ్జెట్ సెషన్ నిర్వహించాలని జగన్ భావిస్తున్నారట. అందుకోసం వివిధ శాఖలకు చెందిన మంత్రులు అందరూ సభలోనే ఉండాలి. కొత్త వారికి అవకాశం కల్పిస్తే సమావేశాల్లో గందరగోళం నెలకొంటుంది. సభలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు వారు సమాధానాలు చెప్పలేరు. దీని ప్రకారం 2022 మార్చిలో బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యాక అనగా ఏప్రిల్ నెల వరకు ప్రస్తుతం ఉన్న మంత్రులకు ఢోకా లేదని తెలుస్తోంది.
Read Also : CM KCR : ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న కేసీఆర్.. ‘ఈటల’ను దెబ్బతీసేందుకు మరో వ్యూహం!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world