...

YS Jagan: త్వరలో ఏపీ మంత్రివర్గ విస్తరణ…వారు జిల్లా ఇన్ చార్జ్ గా బాధ్యతలు తీసుకోవాలి.. జగన్ సంచలన వ్యాఖ్యలు!

YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ నిర్ణయించారు. అయితే రెండున్నర సంవత్సరం కాలంపాటు ఇదే మంత్రి వర్గం విధులను నిర్వహిస్తుందని రెండున్నర సంవత్సరాల తర్వాత మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని జగన్ సూచించారు. అయితే రెండున్నర సంవత్సరం దాటిపోయినా ఇప్పటివరకు మంత్రివర్గ విస్తరణ జరగలేదు. అయితే త్వరలోనే ఏపీ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలియజేశారు. అయితే ఈ మంత్రి వర్గ విస్తరణలో భాగంగా కొందరి మంత్రిపదవులు తొలగిపోతూ కొత్తవారికి అవకాశాలు కల్పించనున్నట్టు తెలుస్తోంది. అయితే మంత్రి పదవి నుంచి వైదొలగిన వారు యధావిధిగా పార్టీకి పని చేయడమే కాకుండా జిల్లా ఇన్ చార్జ్ గా బాధ్యతలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రులకు సూచించారు.

అయితే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గ విస్తరణ గురించి మాట్లాడటంతో ఈ మంత్రి వర్గ విస్తరణలో భాగంగా ఎవరికి మంత్రివర్గ పదవులు ఊడనున్నాయనే విషయం గురించి హాట్ టాపిక్ గా మారింది.ఇదిలా ఉండగా అసెంబ్లీ సమావేశాలలో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2022 -23 ఏడాదికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సమావేశాలలో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి 2లక్షల 56 వేల 257 కోట్లతో బడ్జెట్‌ను రాష్ట్ర అసెంబ్లీ ముందుంచారు. ఇక జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగవ సారి బడ్జెట్ ప్రవేశ పెట్టడం జరిగింది.