Viral Video: సాధారణంగా కొందరు కొన్ని పనులు చేస్తూ ఎంతో ఫేమస్ అవ్వాలని ప్రయత్నిస్తుంటారు. ఇలా ప్రయత్నంలోనే ఎదురు దెబ్బలు తగలడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ మధ్యకాలంలో యువతీ యువకుడు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ విభిన్న రకాలుగా స్టంట్ లను, డాన్స్ రీల్స్ చేస్తూ సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఇలాంటి రీల్స్ చేసే సమయంలో కొన్నిసార్లు ప్రమాదాలు జరిగి ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. ఇకపోతే తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
woman-tried-back-flip-with-saree-do-you-know-what-happened-next-in-video-goes-viral-on-social-media
సాధారణంగా యువతి యువకులు స్టంట్ చేసే సమయంలో డ్రెస్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకొని పెద్ద ఎత్తున స్టంట్లు చేస్తూ ఉంటారు.అయితే తాజాగా ఒక యువతి సాంప్రదాయబద్ధంగా చీరను ధరించి బైక్ పైకి ఎక్కి బ్యాక్ ఫ్లిప్ చేయాలని ప్రయత్నం చేసింది. ఈ విధంగా రోడ్డు వైపు బండి ఆపి ఆ యువతి ఎంచక్కా బండి పైకి ఎక్కి బ్యాక్ ఫ్లిప్ ప్రయత్నం చేసింది. అయితే ఊహించని విధంగా ఆమెకు ఈ ఘటనలో ప్రమాదం చోటుచేసుకుంది.
ఇలా చీరకట్టులో బ్లాక్ ఫ్లిప్ చేయడం వల్ల ఆమె దూరంగా పడకుండా బండికి దగ్గరగా పడటంతో తన తల బండికి బలంగా కొట్టుకుంది. దీంతో ఒక్కసారిగా ఆ యువతికి దిమ్మ తిరిగి పోయింది. ఇలా ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం మీడియాలో వైరల్ గా మారింది. తరచూ ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విధమైనటువంటి స్టంట్ చేసే సమయంలో కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకపోవడంతో పెద్దఎత్తున ప్రమాదాలు చోటు చేసుకొని ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు. మరింకెందుకు ఆలస్యం ఈ యువతి వీడియో పై మీరు ఓ లుక్కేయండి.
AdvertisementView this post on Instagram
Advertisement