Viral News : కొన్ని సందర్భాలలో జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు కళా, నిజమా అన్న అనుమానం వస్తుంది. అచ్చం అలాంటి సంఘటన ఒడిస్సా లోని కటక్ జిల్లా లోని గతిరౌట్ పాట్నా గ్రామ పంచాయితీలో చోటు చేసుకుంది. ఈ వింత ఘటన గురించి తెలుసుకున్న ప్రజలు నిజంగా ఇలాంటివి కూడా జరుగుతాయా? అంటూ ఆశ్చర్యపోతున్నారు. అసలు విషయానికి వస్తే…కటక్ జిల్లా లోని గతిరౌట్ పాట్నా గ్రామ పంచాయితీలో నివాసం ఉంటున్న దినబందు బెహరా అనే వ్యక్తి తను నివసిస్తున్న ఇంట్లో శనివారం తవ్వకాలు జరిపాడు. ఇంట్లో తవ్వకాలు జరిపి చూడగా దినబందు ఒక్కసారిగా షాక్ అక్కడి. తవ్వకాలు జరిపిన ప్రదేశంలో ఏకంగా 14 పురాతన ఇత్తడి విగ్రహాలు కనిపించాయి.
shock-to-know-that-god-appeared-in-a-dream-he-do-that
అయితే దినబందు తన ఇంట్లో తవ్వకాలు జరపటానికి కూడా ఒక పెద్ద కారణం ఉంది. ఈ విషయం గురించి దినబందు మాట్లాడుతూ.. తాను నిద్రపోయిన తర్వాత రోజూ దేవుడు కళ్ళోకి వచ్చి ఇంట్లోని ఒక ప్రాంతంలో తవ్వకాలు జరపాలని చెప్పాడట. దేవుడు కలలో చెప్పిన దాని ప్రకారం దినబందు ఒక రోజు తాను పడుకునే ప్రదేశంలో తొలుత పూజలు నిర్వహించి 15 అడుగుల మేర తవ్వగా 14 ఇత్తడి విగ్రహాలు లభ్యమయ్యాయి.. అంటూ చెప్పుకొచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రాంతాల చెందిన వారు కూడా విగ్రహాలను దర్శించుకోవడానికి వస్తున్నారని ఆయన చెప్పుకొచ్చాడు.
ఈ విషయం తెలుసుకున్న కటక్సదర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో తవ్వకాల్లో లభ్యమైన విగ్రహాలను జిల్లా యంత్రాంగానికి అప్పగించాలని దినబందు బెహన్ ని కోరారు. అయితే విగ్రహాలను జిల్లా యంత్రాంగానికి అప్పగించడానికి ఆయన నిరాకరించాడు. తన కలలో దేవుడు చెప్పిన విధంగా గుడి కట్టించి విగ్రహాలను ప్రతిష్టిస్తానని దినబందు చెప్పుకొచ్చాడు. బెహరా చెప్పిన విధంగా గుడి కట్టించి విగ్రహాలు ప్రతిష్టించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also : Dowry : కూతురి పెళ్లికి కట్నంగా కాలకూట సర్పాలు.. ఈ సంప్రదాయం ఎక్కడో తెలుసా..?