Dowry : వరకట్నం అనేది దేశంలో నిషేధించబడిన ఆచారం. కానీ ప్రతి ప్రాంతంలోనూ ఈ ఆచారం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ ఆచారానికి అడ్డుకట్ట వేయటానికి ప్రభుత్వాలు కఠిన చర్యలు అమలు చేసినా కూడా ఎటువంటి ప్రయోజనం లేదు. కొన్ని సందర్భాలలో ఈ వరకట్న ఆచారం వల్ల మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరకట్నం విషయంలో ఒక్కో ప్రదేశంలో ఒక విధమైన ఆచారం ఉంటుంది. మధ్యప్రదేశ్ లో కూడా వరకట్నం విషయంలో కొన్ని ప్రదేశాలలో చాలా వింత ఆచారాలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని ప్రాంతాలలో వరకట్నంగా డబ్బు, నగలకి బదులు వరుడికి విషపూరిత పాములను కట్నంగా ఇస్తారు. ఈ విషయం వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా? అవునండీ మీరు విన్నది నిజమే.
వివరాలలోకి వెళితే.. మధ్యప్రదేశ్ లోని గౌరియా కమ్యూనిటీకి చెందిన ప్రజలు వరకట్నం విషయంలో ఈ వింత ఆచారాన్ని పాటిస్తారు. కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ప్రజలు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. గౌరియా తెగకు చెందిన ప్రజలు తమ కూతురికి పెళ్లి చేసిన తర్వాత అల్లుడికి ఇరవై ఒక్క విషపూరిత సర్పాలను వరకట్నంగా ఇస్తారు. పాములను వరకట్నంగా ఇవ్వటం వెనుక కూడ ఒక బలమైన కారణం ఉంది. కూతురు పెళ్లి చేసిన తర్వాత పాములను వరకట్నంగా ఇస్తే భార్యాభర్తల మధ్య ఎటువంటి మనస్పర్ధలు లేకుండా వారి జీవితం సాఫీగా సాగిపోతుందని ఇక్కడి ప్రజల నమ్మకం. ఒకవేళ పాములను కట్నంగా ఇవ్వకపోతే వారి మధ్య ఉన్న బంధం విచ్ఛిన్నమవుతుందని అక్కడి ప్రజలు నమ్ముతారు.
సాధారణంగా గౌరియా తెగకు చెందిన ప్రజల వృత్తి పాములు పట్టటం. అందువల్ల కూతురు పెళ్లి నిశ్చయం అయిన తర్వాత తండ్రి పాములను పట్టి వరకట్నంగా ఇస్తారు. అక్కడ ప్రజలు విషపూరిత సర్పాలతో కలిసి జీవిస్తారు. విషపూరిత సర్పాలను సంరక్షించడానికి గౌరియా తెగలో కొన్ని కఠినమైన నియమాలు కూడా ఉన్నాయి. గౌరియా జాతికి సంభందించిన ప్రజలు పెంచుకుంటున్న పాములు చనిపోతే ఇంటిల్లి పాది గుండు చేయించుకోవాలి. అంతే కాకుండా ఆ జాతికి చెందిన ప్రజలందరికీ భోజనాలు కూడా పెట్టించాలి.
Read Also : Viral News: దేవుడు కలలో కనిపించాడని ఆ వ్యక్తి చేసిన పని తెలిస్తే షాక్..!