Viral Video: కూతురి పెళ్లిలో ‘ఊ అంటావా మావా’అంటూ రెచ్చిపోయిన డాన్స్ వేసిన తండ్రి.. వీడియో వైరల్!

Viral Video: మధ్యకాలంలో పెళ్లిళ్లు ఘనంగా చేస్తున్నారు. పెళ్ళిలో వధూవరుల కోసం కుటుంబ సభ్యులు కూడా సినిమా పాటలకు డాన్సులు వేస్తూ ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల ఒక పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. దేవిశ్రీప్రసాద్ పాటలు వింటే ఎవరైనా డాన్స్ చేస్తారు. అలాంటిది పుష్ప సినిమాలోని పాటలకు స్టెప్పులు వేస్తూ ఎంతోమంది వీడియోలు చేసే సోషల్ మీడియాలో చేస్తున్నారు.

ముఖ్యంగా పుష్ప సినిమాలోని సామి… సామి, ఊ అంటావా మామ అనే పాటలకు పెళ్ళిళ్ళలో కూడా డాన్స్ వేస్తున్నారు. సమంత స్టెప్పులు వేసిన ఊ అంటావా మామ అనే సాంగ్ ఎంతో పాపులర్ అయ్యింది. ఇటీవల ఒక పెళ్లి వేడుకలో పెళ్ళికూతురు తండ్రి ఈ పాటకి డాన్స్ వేసి పెళ్లికి వచ్చిన వారందరినీ ఎంటర్టైన్ చేశాడు. తగ్గేదే లే అన్నట్లుగా… పాటకి తగ్గట్టుగా.. డ్యాన్స్ మూమెంట్స్ వేస్తూ.. పెళ్లికి వచ్చిన వారందరినీ ఎంటర్టైన్  చేశాడు.

 

Advertisement
View this post on Instagram

 

A post shared by Anusha Wedding Choreography (@anushaweddingchoreography)


ప్రస్తుతం ఆ డాన్స్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆయన వేసిన డ్యాన్స్ చూసి అక్కడికి వచ్చిన గెస్టులు మాత్రమే కాదు.. ఆ వీడియో చూసిన నెటిజన్లు కూడా ఇంప్రెస్ అయ్యారు. ‘వాహ్.. ఇది కదా గ్రేస్ అంటే’ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా…  ‘డ్యాన్స్ మాత్రమే కాదు.. ఎక్స్‌ప్రెషన్స్ కూడా అదుర్స్.. అంకుల్ మీరు సినిమాల్లో ట్రై చేయండి..’ అని మరొకరు నెటిజన్స్ కామెంట్ చేశాడు.

Advertisement

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel