Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Mahalaxmi-Ravindar: ప్రేమకు అందంతో పనేముంది.. కావాలంటే ఈ జంటను చూడండి

Mahalaxmi-Ravindar: ప్రేమ గుడ్డిది అంటారు కొంత మంది. ఎందుకంటే దానికి అందంతో, ఆస్తి పాస్తులతో సంబంధం లేదని దాని అర్థం. పెళ్లి చేసుకోవడానికి అందం చందం, ఆస్తి పాస్తులు కావాలి. పెళ్లి చేసుకునే ముందు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూస్తారు. కట్న కానుకల గురించి ముందే పక్కాగా మాట్లాడుకుంటారు. ఏమేం పెడతారు.. ఎప్పుడు పెడతారనేది ముందే నిర్ణయించుకుంటారు. కానీ ప్రేమ అనే భావన రావడానికి వీటితో పని లేదు. మనుషులు ఎలా ఉన్నా, ... Read more

By Vinod Kumar

Published on: September 2, 2022 5:30 PM

Updated on: September 2, 2022 5:20 PM

---Advertisement---

Mahalaxmi-Ravindar: ప్రేమ గుడ్డిది అంటారు కొంత మంది. ఎందుకంటే దానికి అందంతో, ఆస్తి పాస్తులతో సంబంధం లేదని దాని అర్థం. పెళ్లి చేసుకోవడానికి అందం చందం, ఆస్తి పాస్తులు కావాలి. పెళ్లి చేసుకునే ముందు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూస్తారు. కట్న కానుకల గురించి ముందే పక్కాగా మాట్లాడుకుంటారు. ఏమేం పెడతారు.. ఎప్పుడు పెడతారనేది ముందే నిర్ణయించుకుంటారు. కానీ ప్రేమ అనే భావన రావడానికి వీటితో పని లేదు. మనుషులు ఎలా ఉన్నా, వారికి ఆస్తి లేకపోయినా, అంతస్తుల్లో ఉండకపోయినా ప్రేమకు అవేవీ పట్టవు. ఎదుటి వారి మనసును మాత్రమే చూస్తారు. అది కల్మషం లేనిదైతే చాలు. వారిని ప్రాణంగా ప్రేమిస్తే చాలు అని అనుకుంటారు. దానిని మరోసారి నిజం చేసి చూపించింది ఈ జంట.

Advertisement

ఆయన తమిళ నిర్మాత. కపేరు రవిందర్ చంద్ర శేఖర, ఆమె పేరు వీజే మహాలక్ష్మీ. తను డైలీ సీరియళ్లలో నటిస్తుంది. ఆయనెమో ఆ సీరియళ్లను నిర్మిస్తుంటాడు. అయితే వీరిద్దరూ తాజాగా తిరుపతిలో పెళ్లి చేసుకుని అందరినీ షాక్ కు గురి చేశారు. ఎందుకంటే.. ఆమె బుట్ట బొమ్మలా అందంగా చక్కగా ఉంటుంది. ఆయనేమో చూడటానికి లావుగా ఉంటాడు. కానీ వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇంకేం శరీర ఆకృతులు, అందచందాలను వారి పట్టించుకోలేదు. బంధు మిత్రుల సమక్షంలో తిరుపతిలో వైభవంగా వివాహం చేసుకుని జీవితంలో ఒక్కటి అయ్యారు. ప్రస్తుతం వీరిద్దరి ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.