Trending News : రీల్ సీన్ రియల్ లైఫ్‌లో రిపీట్… సిబ్బందికి షాక్ ఇచ్చిన రైతు !

Trending News : మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ స్నేహం కోసం ’ సినిమా గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆ సినిమాలో చిరంజీవి, విజయ్​ కుమార్​ కలిసి కారు కొనేందుకు ఓ షోరూమ్​కు వెళ్లగా… వారి వేషధారణ, మాట తీరు చూసి అక్కడి సిబ్బందిని అవమానిస్తారు. ఆ తర్వాత గోనె సంచిలో నుంచి డబ్బుల కట్టలు కిందపోయగా… ఒకింత షాకై తప్పు తెలుసుకుని కారును విక్రయిస్తారు. రీల్ లైఫ్ లో జరిగిన ఇదే సీన్ రియల్ లైఫ్ లోనూ జరిగింది. కర్ణాటకలోని తుముకూర్​లో గల మహీంద్రా షోరూమ్​ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

కెంపెగౌడ అనే రైతు తన మిత్రులతో కలిసి బొలెరో పికప్​ ట్రక్కు కొనేందుకు వెళ్లారు. లోపలకు వెళ్లిన క్రమంలో వారి వేషధారణపై సెటైర్ వేస్తూ అక్కడి సేల్స్​మ్యాన్​ అవమానకరంగా మాట్లాడాడు. అంతే కాకుండా కారు ధర 10 రూపాయలు అనుకుని వచ్చినట్లు ఉన్నారు.. ఇక బయలుదేరండి అంటూ నోటికొచ్చినట్లు వాగాడు. కారు కొనేందుకు ఇంత మంది రారని ఆ రైతు స్నేహితులను ఉద్దేశించి హేళనగా మాట్లాడాడు. ఈ క్రమంలో సేల్స్​మ్యాన్ అన్న మాటలకు రైతు కెంపెగౌడకు పట్టలేని కోపం వచ్చింది. గంటలో రూ.10 లక్షలు తీసుకొచ్చి వెంటనే కారు డెలివరీ చేయాలని షోరూమ్ సిబ్బందిని డిమాండ్​ చేశారు.

Advertisement

రైతు నుంచి ఊహించని విధంగా వచ్చిన ఈ రిప్లైకి షాకైన సిబ్బంది.. మూడు రోజుల్లో కారు డెలివరీ చేస్తామని రైతుకు, ఆయన స్నేహితులకు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిన రైతు.. తుముకూర్​లోని తిలక్​నగర్​ పోలీస్​ స్టేషన్​లో షోరూమ్​ సిబ్బందిపై కంప్లైంట్ చేశారు. దీంతో సేల్స్​మ్యాన్​, ఇతర ఉద్యోగులు తమ తప్పు తెలుసు కున్నారు. కెంపెగౌడకు సిబ్బంది బహిరంగ క్షమాపణలు చెప్పారు.

అలానే రాతపూర్వక క్షమాపణ పత్రాన్ని అందించారు. అనంతరం ఇరువర్గాలతో మాట్లాడిన పోలీసులు వివాదానికి ముగింపు పలికారు. ఈ సంఘటన మొత్తం అక్కడే ఉన్న ఒకరు రికార్డు చేశారు. ఆ సేల్స్​ మ్యాన్ ఒకరి కింద నౌకరి చేస్తున్నాడు కానీ.. రైతు తన పొలంతో తాను సాగు చేసుకుంటూ జమిందారీలా బ్రతకుతాడు. అందుకే రైతులకు ఆత్మాభిమానం ఎక్కువ అనే మాట వాస్తవం అని నిజం అనిపిస్తుంది.

Read Also : Vastu Tips : మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉంటే ఈ వాస్తు చిట్కాలను ఫాలో అవ్వండి…

Advertisement

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel