Tips for youth: పెళ్లి అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో మధురమైన సంఘట. పెళ్లి వల్ల కేవలం రెండు మనసులు, శరీరాలే కాదు.. రెండు కుటుంబాలు కలుస్తాయి. అయితే పెళ్లి నిశ్చయించుకున్న తర్వాతే వివాహం జరిపిస్తారు. నిశ్చితార్థం అనేది అధికారిక ప్రకటన. ప్రేమించి పెళ్లి చేసుకునే వారికి ఒకరి గురించి ఒకరికి ముందుగానే తెలుసు. కానీ పెద్దలు కుదిర్చిన వివాహంలో మాత్రం నిశ్చితార్థం తర్వాతే ఒకరి గురించి ఒకరు తెలుసుకునే వీలు ఉంటుంది. అయితే ఈ సమయంలోనే అబ్బాయి, అమ్మాయి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Image for representation only. Photo: Shutterstock
చాలా మంది తమ గురించి ఎక్కువగా చెప్పుకోవాలని చూస్తుటారు. వీలు దొరికితే చాలు ఇతరులపై3.కూడా తమ ఆధిపత్యాన్ని చాటుతారు. అయితే ఇలా అస్సలే చేయకూడదట. ఇలా చేయడం వల్ల ఎదుటి వాళ్లకు విపరీతమైన చిరాకు కల్గుతుంది. అలాగే అస్సలే అతిగా మాట్లాడకూడదు. గంటల కొద్దీ ఫోన్లలో మాట్లాడటాన్ని తప్పుగా భావిస్తారు. ఇలా తరచుగా ఫోన్ మాట్లాడటం వల్ల పొరపాటున నోరు జారితే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాగే కుటుంబం గురించే అస్సలే చెడుగా చెప్పుకోకూడదు. నిజంగానే మీ కుటుంబ సభ్యుులు అదైనా తప్పు చేసినా అది మీ కాబోయే అమ్మాయి లేదా అబ్బాయికి చెప్పకూడదు. అలాగే మీకు కాబోయే వారితో గౌరవంగా మాట్లాడాలి. ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటేనే బంధం బలంగా ఉంటుంది.