Vastu Tips : ఇల్లు కట్టి చూడు… పెళ్లి చేసి చూడు అని పెద్దలు ఎప్పుడు చెబుతూ ఉంటారు. వినడానికి సర్వసాధారంగానే ఉన్న ఈ మాటలు, చేతల్లో చూపించాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ కష్టం గురించి తెలుస్తుంది. ఇంటి నిర్మాణం అనేది ప్రతి ఒక్కరికీ ఉండే కల. ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు వంట గదికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఇస్తాము. ఈ క్రమంలోనే ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు వంటగది ఎల్లప్పుడూ కూడా ఆగ్నేయ దిశలో ఉండాలని పండితులు చెబుతుంటారు. ఇలా వంటగది ఆగ్నేయ దిశలో ఉన్నప్పుడే మన ఇంట్లో అనుకూల వాతావరణ పరిస్థితులు ఉంటాయని లేదంటే లేనిపోని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
అయితే మహిళలు ఎక్కువ సమయం కిచెన్ లోనే గడపాల్సి వస్తుంది. కనుక కిచెన్ లో ఈ చిట్కాలను పాటించడం వల్ల మనకు ఏ విధమైనటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా స్టవ్ ను వంటగదిలో ఎల్లప్పుడూ మనం తూర్పు దిశకు నిలబడే విధంగా ఉండాలి. అదే విధంగా స్టవ్ కి దగ్గర గానే సింకు ఉండకూడదు. వంటగదిలో ఉండే ఫ్రిడ్జ్, ఇతర సామాన్లు ఎల్లప్పుడూ నైరుతి దిశ వైపు ఉండాలి. ముఖ్యంగా వంటగదిలో సింక్ ఉన్నవారు మనం తిన్న ప్లేట్లను సింక్ లో పడేస్తాము. ఇలా చేయడం వల్ల మన ఇంట్లో అధిక మొత్తంలో నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది.
vastu-tips-for-kitchen-to-aviod-financial-problems
అందుకే ప్లేట్లను వెంటనే శుభ్రం చేయాలి. లేదంటే బయట వేయాలని పండితులు చెబుతున్నారు. ఇక చాలా సార్లు మన ఇంటిలో నల్లా నుంచి వాటర్ లీకేజ్ వస్తుంటుంది. ఇలా వాటర్ లీకేజ్ అవ్వటం వల్ల మన సంపద కూడా అలాగే వెళ్ళిపోతుందని అంటున్నారు. అందుకోసమే వెంటనే అలాంటి వాటికి మరమ్మత్తు చేయించాలి. మహిళలు ఈ విధమైన చిట్కాలను పాటించడం వల్ల ఆ ఇంటిలో సంపదకు కొదువ ఉండదని తెలియజేస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఈ చిట్కాలను పాటించండి…
Read Also : Vastu Tips : ఇంటి గుమ్మం వద్ద ఈ వస్తువులు పెడితే చాలు.. మీ ఇంటికి ధన ప్రవాహమే?