Vastu Tips : మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి ఒక్క విషయంలోనూ వాస్తు శాస్త్రాన్ని ఎంతగానో నమ్ముతాము. మనం చేసే పనులలో వాస్తు శాస్త్రాన్ని పాటించి చేయటం వల్ల అంతా శుభం కలుగుతుందని భావిస్తాము. ఇకపోతే వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంటికి సకలసంపదలు కలగాలని అలాగే,ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉండాలని భావిస్తూ కొందరు ఎన్నో వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటారు. అయితే మనకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఇంటి ప్రధాన గుమ్మం వద్ద ఈ వస్తువులను పెట్టడం వల్ల మన ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది.
మన ఇంటికి ప్రధాన ద్వారం ఎంతో ముఖ్యమైనది ఈ క్రమంలోనే ప్రధాన ద్వారం వద్ద మామిడి తోరణాలు కట్టడం శుభప్రదంగా భావిస్తారు. ఇలా మామిడి తోరణాలు ఎండిపోయిన తర్వాత వాటిని తొలగించి తిరిగి కట్టడం వల్ల మన ఇంటి పై ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. అదేవిధంగా ప్రధాన ద్వారం పైభాగంలో తప్పకుండా వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేయడం ఎంతో మంచిది.
ఇకపోతే మనం ఏదైనా శుభకార్యం చేసే ముందు స్వస్తిక్ గుర్తు వేయడం చేస్తుంటాము.ఇలా ఇంటి ప్రధాన ద్వారం ఇరువైపులా స్వస్తిక్ గుర్తు వేయటం వల్ల మన ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా మన ఇంటి పరిసరాలలో పాజిటివ్ ఎనర్జీ కలిగేలా చేస్తుంది. ముఖ్యంగా దీపావళి వంటి పండుగ సమయాలలో మన ఇంట్లో లక్ష్మీదేవి పాదాల గుర్తులను వేసుకుంటాము. ఇలా వేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుందని భావిస్తారు.అయితే ఇంటి ప్రధాన ద్వారం గడప పై భాగంలో స్వస్తిక్ గుర్తుతో పాటు లక్ష్మీదేవి పాదాలను వేయటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో తాండవం చేస్తుందని చెప్పాలి.ఇక ప్రతిరోజూ ఉదయం సాయంత్రం ఇంటిని శుభ్రంగా ఉంచుకుని దీపారాధన చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉండి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.
Read Also : Chanakya Niti: జీవిత భాగస్వామిని ఎంచుకునే సమయంలో గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయాలు ఇవే… చాణిక్య నీతి!
Tufan9 Telugu News And Updates Breaking News All over World