Morning Wakeup Tips : ఈ రోజు ఉదయం నిద్ర లేవగానే ఎవరి ముఖం చూశామో… అంతా చెడే జరుగుతుంది. ఏ పనిచేసినా అసలు కలసి రావడం లేదు… అని చాలా మంది అంటుంటారు. అయితే వాస్తవానికి ఉదయం నిద్ర లేవగానే కొన్నింటిని చూడడం వల్ల మనకు ఎలా చెడు ఫలితాలు కలుగుతాయో… కొన్నింటిని చూస్తే అన్నీ మంచి ఫలితాలే కలుగుతాయి అని అంటున్నారు నిపుణులు. అవేమిటో ఇప్పుడు మీకోసం ప్రత్యేకంగా…

tips-to-morning-wakeup-to-lead-a-better-day
ఉదయం నిద్ర లేవగానే ఆలయ శిఖరాన్ని చూస్తే చాలా మేలు జరుగుతుంది. ఆ రోజు ఏం పని చేసినా విజయం సాధిస్తారు. దైవం ఆశీస్సులు లభిస్తాయి. అలాగే ఉదయం నిద్ర లేచిన వెంటనే సుమంగళిని, ఆవును, యజ్ఞాన్ని చూస్తే చాలా మంచి జరుగుతుంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే నది, సముద్రం, సరస్సులను చూస్తే దోషాలు పోతాయి. అలాగే ఎవరి అరచేతులను వారు చూసుకోవచ్చు. మన చేతి వేళ్ల చివర్లలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెబుతారు.
కనుక అరచేతులను చూస్తే ఆ రోజు ధనం లభించే అవకాశం ఉంటుంది. కనుక ఉదయం నిద్ర లేచిన వెంటనే ఎవరి అరచేతులను వారు చూసుకోవాలి. ఇక ఉదయం నిద్ర లేచిన వెంటనే గాయత్రి మంత్రాన్ని పఠించాలి. ఇష్ట దైవం ఫొటో లేదా విగ్రహాన్ని చూడాలి. నెమలిని కూడా చూడవచ్చు. పువ్వులను చూసినా అంతా మేలే జరుగుతుంది. ఉదయం నిద్ర లేచాక ఒకటిన్నర నిమిషాల వరకు ఏ మనిషిని గానీ, వారి నీడను గానీ చూడకూడదు.
Read Also : Vasthu Tips : ఇలా చేస్తే.. ఇంట్లో ఎప్పుడూ డబ్బులే డబ్బులు.. బెస్ట్ మనీమంత్రా.. అద్భుతమైన ఫలితాలు..!