Chanakya Niti : ఆచార్య చాణిక్యుడు ఒక మనిషి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే అతనిలో ఏ విధమైనటువంటి లక్షణాలు ఉండాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఎలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి అనే విషయాల గురించి తన గ్రంథం ద్వారా తెలియజేశారు. ఇలా ఆచార్య చాణిక్యుడు ఒక మనిషి తన జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి ఉపయోగపడే ఎన్నో మంచి విషయాలను తెలియ చేశారు.ఈ క్రమంలోనే ఒక వ్యక్తి జీవితంలో వివాహం అనేది ఎంతో ముఖ్యమైన వేడుక .కనుక ప్రతి వ్యక్తి తన జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు కొన్ని విషయాలను గుర్తించుకోవాలని చాణిక్యుడు తెలిపారు. మరి ఆ విషయాలు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…
*ఒక రోగి నైనా పెళ్లి చేసుకో కానీ సహనం లేని వ్యక్తిని పెళ్లి చేసుకోవద్దని చాణిక్యుడు తెలియజేస్తున్నారు. సహనం లేనివారితో జీవితాంతం గడపాలంటే ఎంతో కష్టం అందుకే మీరు పెళ్లి చేసుకోబోయే వారిలో సహనం అనే లక్షణం తప్పనిసరిగా ఉండాలని చాణిక్యుడు తెలియజేస్తున్నారు.
*ప్రశాంతమైన మనస్తత్వం కలవారిని పెళ్లి చేసుకోవడంతో ఆ ఇంటిలో లక్ష్మీకటాక్షం కలుగుతుంది.నిత్యం కోపంతో రగిలిపోతున్న వారిని పెళ్లి చేసుకోవడం వల్ల ఆ ఇంటిలోని వాతావరణం ఎప్పుడూ అలాగే ఉంటుంది.
*మధురంగా, మంచి మాటలు మాట్లాడే వారిని పెళ్లి చేసుకోవాలి అలా కాకుండా అసభ్య పదజాలంతో మాట్లాడేవారు గట్టి గట్టిగా అరిచే వారిని జీవిత భాగస్వామిగా చేసుకోవద్దని ఆచార్య చాణక్యుడు తన నీతి గ్రంథం ద్వారా వెల్లడించారు.
*మతపరమైన ఆచార వ్యవహారాలు తెలిసిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఆచార్య చాణిక్యుడు సూచించారు. నిత్యం ఆ భగవంతుని స్మరిస్తూ పూజ చేస్తూ, దేవుడిపై నమ్మకం ఉన్న వ్యక్తులను జీవిత భాగస్వామిగా ఎంచుకోవాలని చాణిక్యుడు వెల్లడించారు
Read Also : Chanakya Niti : ఆచార్య చాణక్య నీతిశాస్త్రం.. జీవితంలో ఈ మూడు విషయాలనూ ఎలాంటి మొహమాటం అక్కర్లేదు అంటున్నాడు..
Tufan9 Telugu News And Updates Breaking News All over World