PM Tractor Yojana : ప్రస్తుత కాలంలో వ్యవసాయం చేయటం రైతన్నకు చాలా భారంగా మారిపోయింది. ఈ రోజుల్లో వ్యవసాయ కూలి ఖర్చులు కూడా భారీగా పెరిగిపోయాయి. దీంతో వచ్చే ఆదాయం కూలి ఖర్చులకు సరి పోవటంతో రైతులు పంటలు పండించడానికి ఆసక్తి చూపటం లేదు. అందువల్ల వ్యవసాయంలో కూలి ఖర్చును తగ్గించడానికి ప్రభుత్వాలు యంత్రికరణ ప్రోత్సహిస్తున్నాయి. ఈ క్రమంలో వ్యవసాయానికి సంబంధించిన యంత్రాలను కొనుగోలు చేయటానికి ప్రభుత్వం సబ్సిడీని అందిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ట్రాక్టర్ కొనుగోలు పై కూడా సబ్సిడీ ఇస్తోంది. ‘పీఎం ట్రాక్టర్ యోజన’ ద్వారా కేంద్ర ప్రభుత్వం ట్రాక్టర్ల పై 50 శాతం సబ్సిడీ తో ట్రాక్టర్లు అందజేస్తోంది.
ఇప్పటికే రైతులకు ఉపయోగపడేలా పీఎం కిసాన్ యోజన,పీఎం కుసుం యోజన, పీఎం ఫసల్ బీమా యోజన, పీఎం కృషి వికాస్ యోజన, పీఎం కృషి సించాయి యోజన .. ఇలా ఎన్నో పథకాల ద్వారా రైతులకు చేయూతనందిస్తోంది. ఇటీవల సీఎం ట్రాక్టర్ యోజన పథకం ద్వారా సగం ధరకే రైతులకు ట్రాక్టర్ ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. నిజానికి ఒక పంట పండించటానికి రైతులకు ట్రాక్టర్ అవసరం చాలా ఉంటుంది. పొలాన్ని దుక్కి దున్ని.. విత్తనాలు నాటి, పంటని మార్కెట్ కి చేర్చడంలో రైతులకు బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో కూలీల రేట్లు కూడా బాగా పెరిగిపోయాయి.
ఈ క్రమంలో పేద రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పీఎం డాక్టర్ యోజన పథకం రూపొందించింది. ఈ పథకం ద్వారా రైతులు సగం ధరకే ట్రాక్టర్ ని పొందే అవకాశం కేంద్రం ప్రభుత్వం అందిస్తోంది. పిఎం కిసాన్ ట్రాక్టర్ యోజన కింద రైతులు ఏ కంపెనీకి చెందిన ట్రాక్టర్ అయినా సగం ధరకే పొందవచ్చు. అంతే కాకుండా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 20 నుండి 50 శాతం వరకు ట్రాక్టర్ల పై సబ్సిడీని అందిస్తున్నాయి. పీఎం ట్రాక్టర్ యోజన ద్వారా రైతులు ట్రాక్టర్ పొందటానికి సొంత వ్యవసాయ భూమిని కలిగి, భూమి పాస్ బుక్, బ్యాంక్ ఖాతా పాస్ బుక్, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, పాస్ పోర్ట్ సైజు ఫొటో తీసుకెళ్లి మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్‌కి వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
Read Also : Ration cards: రేషన్ కార్డులపై ఆర్థిక శాఖ అలర్ట్.. కేంద్రానికి హెచ్చరిక