Kid Play Snake Video : ఈ బుడతడు.. సోషల్ మీడియాలో సెన్సేషన్.. అందరిలా మాములుడు కాదు.. ఏకంగా పామును పట్టేసుకుని దానికి చుక్కలు చూపించాడు.. అందరిని ఔరా అనిపిస్తున్నాడు.. చేతిలో పామును పట్టుకుని ఆడుకుంటున్న చిన్నపిల్లాడి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదో ఆకుపచ్చ రంగులో ఉన్న పామును చేతిలో పట్టుకుని ఆడుతున్నాడు.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. పిల్లాడు పాముతో ఆడుతుంటే అలానే వీడియో తీస్తున్నారంటూ మండిపడుతున్నారు. అదో జూ లాంటి ప్రదేశంలా కనిపిస్తోంది. అక్కడ ఒక పిల్లాడు నిలబడి ఉన్నాడు. అతడి చేతుల్లో ఆకుపచ్చని రంగులో పాము కనిపిస్తోంది. ఆ పిల్లాడు ఆ పాముతో ఆడుతూ కనిపించాడు. పిల్లాడి శరీరంపై పాము పాకుతోంది.
ఆ పిల్లాడు ఎంతమాత్రం భయం లేకుండా పామును అలానే పట్టుకుని నిలబడ్డాడు. పైగా నవ్వుతున్నాడు కూడా.. అదేదో బొమ్మ పామును అనుకున్నాడో ఏమో తెగ ఆడుతున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను ‘Snake_World’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ పోస్ట్ చేశారు. జనవరి 14న ఈ వీడియో అప్‌లోడ్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ వీడియోకు 28 వేల వ్యూస్ వచ్చాయి. వీడియోను చూసిన నెటిజన్లు తిడుతూ కామెంట్లు చేస్తున్నారు.
AdvertisementView this post on Instagram
Advertisement
అది పాము.. బొమ్మ కాదు ఆడుకోవడానికి.. తల్లిదండ్రులు ఇలా పిల్లల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని ఏకిపారేస్తున్నారు. వాస్తవానికి ఆ పాము విషపూరితం కాదు కాబట్టి సరిపోయింది.. అదే విషపూరిత పాము అయితే ఏంటి.. పిల్లాడి ప్రాణాలతో చెలగాటమా? అని నెటిజన్లు గట్టిగానే హెచ్చరిస్తున్నారు.
Read Also : Biggboss Himaja : పెళ్లి, విడాకుల వార్తలపై.. బిగ్‌బాస్ బ్యూటీ హిమజ క్లారిటీ..!