...

Upasana Clarity : పిల్లల గురించి క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్ భార్య ఉపాసన..? అప్పుడే ప్లాన్ చేస్తాం..! 

Upasana Clarity : మెగాస్టార్ వారసుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన స్నేహితురాలైన ‘ఉపాసన’ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటుంటారు. చెర్రీ సినిమాల్లో బిజీగా ఉండగా, ఉపాసన అపోల్ హాస్పిటల్స్ నిర్వహణలో పాలుపంచుకుంటోంది. అదే విధంగా పలు సామాజిక కార్యక్రమాల్లోనూ ఆమె ముందుంటుంది. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి ఓపెన్‌గా చెప్పుకొచ్చింది ఉపాసన..
మీ భర్త రాంచరణ్, మీ మామగారైన చిరంజీవి సినిమాల్లో మీకు ఏవి అంటే బాగా ఇష్టం అని యాంకర్ అడుగగా.. చెర్రీ నటించిన ‘రంగస్థలం’,మెగాస్టార్ మూవీల్లో ‘సైరా నరసింహారెడ్డి’అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది మెగా ఫ్యామిలీ కోడలు..ఇకపోతే చెర్రీ ఉపాసనకు మ్యారేజ్ అయ్యి ఇప్పటికే చాలా ఏళ్లు గడిచాయి. చెర్రీ -ఉపాసన జంటకు ఇంకా పిల్లలు కలుగకపోవడానికి కారణం ఏంటనీ కొందరు కామెంట్స్ చేస్తుండగా.. మెగా అభిమానులు మాత్రం చిరు ఫ్యామిలిలో మరో వారసుడు ఎప్పుడు రాబోతున్నాడని ఆశగా ఎదరుచూస్తున్నారని యాంకర్ ప్రశ్నించగా..
అది తన పర్సనల్ విషయమని, ఎవరు ఏమనుకున్నా తాను స్పందించబోనని స్పష్టంచేశారు ఉపాసన. ఈ విషయం గురించి ఇప్పటికే తనను చాలా మంది అడిగారని, కానీ మేము ఇంకా ప్లాన్  చేసుకోలేదని తెలిపింది. ప్రస్తుతమున్న భయానక సిచ్యువేషన్స్‌లో తాము పిల్లలను కనాలని అనుకోవడం లేదని చెప్పింది. ఎప్పుడైతే   ఈ భయానక పరిస్థితులు సర్దుమణుగుతాయో అప్పుడు  తాను చెర్రీ పిల్లల గురించి ఆలోచిస్తామని, అప్పటివరకు ఎవరి పనిని వారం చేసుకుంటూ ముందుకు వెళతామని స్పష్టంచేసింది ఉపాసన.
Read Also : Siri Shanmukh : సిరి పాపకు పెద్ద పంచ్ వేసిన షణ్ముక్.. నీవేం పెద్ద అందగత్తెవు కాదు అంటూ..