Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో లాస్యం అందరూ కలసి ప్రతి ఇంటికి వెళతారు.
ఈరోజు ఎపిసోడ్ లో పరంధామయ్య ఇక్కడికి ఎందుకు వచ్చావురా అని నందుని ప్రశ్నించగా, నీ మాజీ కోడలు జాబ్ వెతుక్కుని చెప్పండి నాన్న. జాబ్ కి వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం డిగ్నిటిగా ఉండమని చెప్పండి అని చెప్పి ఆఫీస్ లో జరిగిన వ్యవహారం అంతా వివరిస్తాడు.
అప్పుడు నందు కన్నకొడుకు గా మిమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత నాది ఇక మీ దగ్గర ఉంటుంది కాబట్టి తులసి బాధ్యత కూడా నాదే అని అనడంతో అప్పుడు అనసూయ నందు ని మాటలతో దెప్పి పొడుస్తుంది. ఒక బియ్యం బస్తా కూడా మోయలేనిది సంసారాన్ని మోస్తుందా అని నందు అనటంతో అప్పుడు దివ్య, తులసి ఇద్దరూ ఆ బియ్యం బస్తాను మోసుకెళ్ళి ఇంట్లో పెట్టి నందు కి బుద్ధి చెబుతారు.
ఆ తర్వాత ఇంటికి వెళ్లిన తరువాత లాస్య కనీసం మీ అమ్మానాన్నలు నేను ఇంట్లోకి కూడా రమ్మని పిలవలేదు అని మండిపడుతుంది. అప్పుడు నందు వెళ్లి కొన్ని మంచి నీళ్ళు తీసుకొని రా అని చెప్పగా నువ్వు వెళ్లి తెచ్చుకో అని లాస్య కోప్పడుతుంది.
మరొకవైపు అనసూయ పరంధామయ్యలు మనం తులసికి భారంగా ఉన్నాయేమో అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత దివ్య ,తులసి దగ్గరికి వెళ్లి కాలేజీ గురించి మాట్లాడి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. మరొక వైపు నందు దివ్య కాలేజ్ ఫీజ్ కట్టడానికి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తాడు.
అప్పుడు దివ్యను ప్రిన్సిపాల్ ఆఫీస్ రూమ్ లోకి రమ్మని పిలుస్తుంది. అక్కడ ఆఫీస్ రూమ్ లో నందిని చూసిన దివ్య ఆఫీస్ కట్టడానికి మీరెవరు అని నందుని అడిగి ప్రిన్సిపాల్ ముందే అవమానిస్తుంది. అది నా బాధ్యత అని నందు అనడంతో మీకు ఎప్పటి నుంచి ఈ బాధ్యతలు గుర్తుకు వస్తున్నాయి డాడ్ అని అడుగుతుంది.
అప్పుడు నేను కాలేజీ ఫీజు కడతాను అని నందు అనడంతో కాలేజ్ ఫీజ్ కట్టకపోతే నేను కాలేజీకి రావడమే మానేస్తాను అని దివ్య కోపంగా అక్కడి నుంచి వెళ్లి పోతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.