Horoscope : ఈరోజు అనగా సెప్టెంబర్ 9వ తేదీ నాడు పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. చతుర్ధశి తిథి, ధనిష్ట నక్షత్రం కావడంతో ఈ రెండు రాశుల వారు ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది. వారికి పరిస్థితులు అన్నీ అనుకూలిస్తాయి. ఏ పని చేసినా ఫలితం చాలా అనుకూలంగా ఉంటుందనది జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అయితే లక్కులో ఉన్న ఆ రెండు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి.. వృషభ రాశి వాళ్లు ఏ పని తల పెట్టినా విజయ వంతం అవుతుంది. ఆర్థికంగా మొదలు పెట్టిన పనులన్నీ మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్థిల్లుతుంది. ఆర్థికంగా చాలా లాభాలు వస్తాయి. ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి వారు అనుకోకుండా వారి పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది. వ్యాపారులకు ఈ రోజు దివ్యమైన రోజు అనే చెప్పాలి. ఏ పని తలపెట్టినా విజయం సాధించడం పక్కా కాబట్టి.. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని.. అవి జీవితంపై మంచి సానుకూల ప్రభావం పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త అవసరమని అంటున్నారు
వృశ్చిక రాశి.. వృశ్చిక రాశి వారికి ఈ శుక్రవారం అమోఘంగా ఉంది. ఏ పని మొదలు పెట్టినా.. అందులో విజయం సాధిస్తారు. ఆర్థికంగా మంచి లాభాలను అందుకుంటారు. కొత్త మార్గాల్లో ఆదాయం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ వాటిపై తొందరపాటు పడకుండా.. ఆచి తూచి వ్యవహరిస్తే.. వచ్చే ఫలితం రెట్టింపు ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఏ పని తలపెట్టినా.. జీవిత భాగస్వామితో చర్చించాకే.. వారికి ఆ పని గురించి చెప్పిన తర్వాతే ముందుకు వెళ్లడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.