Horoscope : ఈరోజు అనగా సెప్టెంబర్ 8వ తేదీ నాడు పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల ఈ రెండు రాశుల వాళ్లకి ఈ సమస్యలు తప్పవని చెప్పారు. అయితే ఆ రెండు రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి.. వృషభ రాశి వాళ్లకు తలపెట్టిన కార్యాలు, ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు రావచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. లేదంటే చాలా మందితో గొడవలు తప్పవు. గోసేవ చేస్తే అంతా మంచే జరుగుతుంది.
మిథున రాశి.. మిథున రాశి వాళ్లు కీలక వ్యవహారాలలో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర ధనవ్యయ సూచితం. కాబట్టి ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉండటం మంచిది. కాస్తయినా ఖర్చులు తగ్గించుకోవచ్చు. బంధువులతో వాదనలకు దిగడం వలన విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇష్టదేవతా స్తోత్ర పారాయణ చేస్తే మంచిది.