Weekly horoscope : ఈ వారం అనగా అక్టోబర్ 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల ఈ రెండు రాశుల వాళ్లకి ఈ సమస్యలు తప్పవని చెప్పారు. అయితే ఆ రెండు రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి.. వృషభ రాశి వాళ్లకు ఉద్యోగంలో శ్రమ ఫలిస్తుంది. స్వయంకృషితో పైకి వస్తారు. ఇతరులపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధార పడవద్దు. వ్యక్తిగత విషయాల్లో అభివృద్ధి సూచితం. ధనలాభం ఉంది. ఆనందంగా ఖర్చు చేస్తారు. బంధు మిత్రుల అభినందనలు ఉంటాయి. దేనికీ వెనకాడ వద్దు. సమష్టి కృషితో సంకల్పం సిద్ధిస్తుంది. సుబ్రహ్మణ్య ఆరాధనతో మానసిక శక్తి లభిస్తుంది.
వృశ్చిక రాశి.. వృశ్చిక రాశి వాళ్లకు ఉత్తమ కాలమిది. శుభ ఫలితం సొంతం అవుతుంది. అభీష్ట సిద్ధి ఉంది. ఉద్యోగంలో గుర్తింపు పొందుతారు. మంచి పనులు చేసి విశేష లాభాలు అందుకోవాలి. గొప్ప భవిష్యత్తు లభిస్తుంది. అర్హతలను పెంచుకుంటూ సమాజంలో పేరు సంపాదించుకోవాలి. బంధుమిత్రుల ఆదరణ ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఇష్టదైవాన్ని స్మరించండి, మనశ్శాంతి లభిస్తుంది.