Horoscope today : ఈరోజు అంటే జూన్ 2వ తేదీ గురువారం రోజు గురు, రాహు, కేతు, శని గ్రహాల వల్ల ఈ రెండు రాశుల వాళ్లకు చాలా బాగుంది. ముఖ్యంగా వాళ్లు ఏ పని ప్రారంభించినా దాన్ని కచ్చితంగా పూర్తి చేయగల్గుతారు. దాని వల్ల వీరికి చాలా లాభాలు కూడా కల్గబోతున్నాయి. అయితే ఆ రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా కర్కాటక రాశి.. ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు. అలాగే దీని వల్ల అనేక లాభాలను కూడా పొందుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఊహించిన ఫలితాలను అందుకుటారు. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శివనామాన్ని జపించాలి.
సింహ రాశి.. సింహ రాశి వాళ్లు ఈ రోజు ప్రారంభించిన పనులను త్వరగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో అనేక లాభాలు ఉన్నాయి. బంధు,మిత్రుల ఆదరాభిమానాలు ఉంటాయి. ఉల్లాసభరితమైన వాతావరణం నెలకొంటుంది. ఆధ్యాత్మికంగా శుభకాలం. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.
Read Also : Horoscope : సంకోచించకుండా నిర్ణయాలు తీస్కుంటేనే ఈ రాశుల వారికి లక్కు.. లేదంటే!