Horoscope : ఈరోజు అంటే జూన్ 3వ తేదీ శుక్రవారం రోజున.. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల పలు రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రెండు రాశుల వాళ్లు ఈరోజు ఈశ్వరుడిని దర్శించుకోవాలి. అంటే శివాలయాలకు వెళ్లి ఆ బోళా శంకరుడిని మొక్కుకోవాల్సిందేనని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

మేష రాశి.. ఈ రాశి వాళ్లకు ఈరోజు చాలా మంచి కాలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు,మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అలాగే ఈశ్వర సందర్శనం మంచిది. ఈరోజు కచ్చితంగా ఆ శివుడిని దర్శించుకుంటే మీకు మంచి జరుగుతుంది.
కర్కాటక రాశి.. పనుల్లో ఆటంకాలు ఎదురైనా తెలివిగా పరిష్కరిస్తారు. ఒక ముఖ్య విషయమై పెద్దలను కలుస్తారు. ఆశించిన ఫలితం దక్కుతుంది. ఆదాయం కన్నా వ్యయం మించకుండా చూసుకోవాలి. ఈశ్వర దర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. కాబట్టి కచ్చితంగా శివాలయానికి వెళ్లి స్వామి వారి అనుగ్రహం పొందడి.
Read Also : Horoscope today : ఈరోజు ఈ రెండు రాశుల వాళ్లు ఏ పని ప్రారంభించినా… లక్కే లక్కు!