Horoscope : ఈ వారం అంటే జూన్ 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఈ రెండు రాశుల వాళ్లకు పట్టిందల్లా బంగారమేనని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ రెండు రాశులు ఏంటి, వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా కుంభ రాశి.. శ్రేష్ఠమైన కాలం నడుస్తోంది. కోరికలు నెరవేరతాయి. మంచి భవిష్యత్తు మీ సొంతం అవుతుంది. ప్రయత్నాలు ఫలించి అనుకున్న స్థాయికి చేరుకుంటారు. ఉద్యోగంలో శ్రమ పెరిగినా ఫలితం బాగుంటుంది. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. సమష్టిగా తీసుకునే నిర్ణయం మేలు చేస్తుంది. వ్యాపారంలో ఉన్నతమైన స్థితి గోచరిస్తుంది. ఇష్ట దైవాన్ని స్మరించండి, శాంతి లభిస్తుంది.
మీన రాశి.. ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పుష్టి ఏర్పడుతుంది. వ్యాపార రీత్యా స్వల్ప ఆటంకాలు ఎదురైనా అంతిమంగా మంచి జరుగుతుంది. మొహమాటంతో కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. చంచలత్వం పనికి రాదు. పట్టుదలతో ముందుకు వెళ్లండి. ధర్మ మార్గంలో విజయం సాధిస్తారు. నవ గ్రహ శ్లోకాలు చదివితే మంచిది.
Read Also : Horoscope : ఈ రెండు రాశుల వారు ఆవేశపడితే.. ఇక మీ పని అంతే, జాగ్రత్త సుమీ!