...

Horoscope : ఈరోజు ఈ రెండు రాశుల వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే గొడవలే!

Horoscope : ఈరోజు అంటే జూన్ 8వ తేదీ బుధవారం రోజు ఈ రెండు రాశుల వాళ్లు చాలా జాగర్త్తగా ఉండాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల ఈ రెండు రాశుల వాళ్లకు గొడవలు జరిగే సూచనలు ఉన్నాయని వివరిస్తున్నారు. అయితే ఈ రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Horoscope
Horoscope

ముందుగా వృషభ రాశి… అనుకూల ఫలితాలు కలవు. కొత్త పనులను ప్రారంభిస్తారు. పెద్దల ఆశీర్వచనాలు ఫలిస్తాయి. కాకపోతే సమస్యగా అనిపించిన అంశాన్ని అస్సలే నిర్లక్ష్యం చేయొద్దు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ బంధువుల వ్యవహారాల్లో తల దూర్చకూడదు. ఒకవేళ మాట సాయానికి వెళ్లినా పెద్ద సమస్యలో ఇరుక్కుంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. శివుణ్ణి ఆరాధిస్తే మంచిది.

మిథున రాశి.. మొదలు పెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కీలక విషయాలను కొంత కాలం వాయిదా వేసుకుంటే మంచిది. అలాగే ఇతరుల వ్యవహారాలలో అస్సలే జోక్యం చేసుకోవద్దు. ఏమాత్రం మధ్యలోకి వెళ్లిన మీరు సమస్యల్లో ఇరుక్కునే అవకాశం మెండుగా కనిపిస్తోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. సూర్య కవచ స్తోత్రం పఠించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

Read Also :  Horoscope : ఈ వారం ఈ రెండు రాశుల వాళ్లకు పట్టిందల్లా బంగారమే.. ఓసారి చూడండి!