Viral Video : ప్రస్థుత కాలంలో పెళ్ళి అంటే ఖరీదైన కల్యాణ మండపంలో అందమైన డెకరేషన్ మద్య బంధుమిత్రుల సమక్షంలో చేసుకునే ఒక మధురమైన వేడుక. ఈ రోజుల్లో పెళ్లి వేడుకలు డాన్సులు చేస్తూ చాలామంది సందడి చేస్తున్నారు. ఇక వధువరూల విషయానికి వస్తే ఒకరితో ఒకరు పోటీ పడుతూ డాన్సు చేస్తున్నారు. మునుపటి రోజులలో అమ్మాయిలు అందరి ముందు డాన్స్ చేయటానికి సిగ్గుపడే వారు. కానీ ఈ రోజుల్లో అమ్మాయిలు తమ పెళ్లిలో డాన్స్ చేస్తూ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నారు.
ఈరోజుల్లో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందడంతో ఈ డాన్స్ ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తు పాపులర్ అవుతున్నారు. పెళ్లి వేడుకల్లో వధూవరులతో పాటు వారి బంధుమిత్రులు కూడా డాన్సులు చేస్తూ సందడి చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఇటువంటి డాన్స్ వీడియోలు ఎన్నో వైరల్ గా మారాయి. ఇటీవల ఒక పెళ్ళికూతురు బంజారా పాటకు మాస్ స్టెప్పులు వేస్తూ డాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో పెళ్లికూతురు ప్రొఫెషనల్ డాన్సర్ లకి ఏ మాత్రం తగ్గకుండా ఒక బంజారా పాటకి మాస్ స్టెప్పులు వేసింది. పెళ్లి కూతురుతో పాటు ఆమె స్నేహితురాలు కూడా డాన్స్ వేయటంతో కొంత సమయం తర్వాత కొందరు బంధువులు కూడా వారితో పాటు స్టెప్పులు వేస్తూ వారిని ప్రోత్సహించారు. పెళ్లికూతురు తరపు బంధువులు కూడా ప్రోత్సహించడంతో పెళ్లికూతురు తగ్గేదే లే అన్న లెవల్లో ఊర మాస్ స్టెప్పులు వేసి రచ్చ రచ్చ చేసింది.
Read Also :Viral Video: ముసుగు వేసి మొసలితో పరచకాలు.. ఆ మొసలి చేసిన పని చూస్తే షాక్..!