TSPSC Group-1: తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలోనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియలను ప్రారంభించారు. 18 శాఖలలో 501 గ్రూప్ వన్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఈ ఉద్యోగాల కోసం ఈనెల 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. టీఎస్‌పీఎస్సీ ఓటీఆర్ ఆధారంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉండగా ఇప్పటికే అధికారులు ఓటీఆర్‌లో మార్పులు చేసుకొనే వెసులుబాటు కల్పించారు. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే ఉద్యోగులు వారి పై అధికారుల నుంచి నిరభ్యంతర పత్రం సమర్పించాల్సి ఉంటుందని వెల్లడించారు.
మరి ఈ ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే విషయానికి వస్తే…
అభ్యర్థులు ముందుగా సంబంధిత https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ ఓపెన్ చేసి వన్ టైం రిజిస్ట్రేషన్ చేయాలి. హోం పేజ్ కుడివైపున వన్ టైం రిజిస్ట్రేషన్ బటన్ పై క్లిక్ చేయగా, కొత్త పేజీ ఓపెన్ అయి ఆధార్ డీటెయిల్స్ అడుగుతుంది. ఈ క్రమంలోనే ఆధార్ కార్డు నెంబర్ తో పాటు ఆధార్ కార్డులో ఉన్న విధంగా పేరు ఎంటర్ చేయాలి.
Personal Details సెక్షన్‌లో ఎస్ఎస్‌సీ లేదా తత్సమాన సర్టిఫికెట్‌లో ఉన్నట్టుగా అన్ని వివరాలను నమోదు చేయాలి. అడ్రస్ సెక్షన్లో మీ చిరునామా, ఫోన్ నెంబర్ ఇమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి.
ఒకటవ తరగతి నుంచి మీరుచదివిన చదువుకు సంబంధించిన అన్ని వివరాలను కూడా నమోదు చేసి సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి.
Additional Qualifications సెక్షన్‌లో అదనపు అర్హతల వివరాలు ఎంటర్ చేయాలి. ఫోటో సంతకం అప్‌లోడ్ చేయాలి.ఆ తర్వాత ప్రివ్యు క్లిక్ చేసి మన వివరాలు అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఏవైనా తప్పులు ఉంటే తిరిగి సరి చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తే TSPSC ID జనరేట్ అవుతుంది. టీఎస్‌పీఎస్‌సీ ఏ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసినా TSPSC ID ఎంటర్ చేసి అప్లై చేయొచ్చు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World