...

Crime News: అబ్దుల్లాపూర్ మెట్ డబుల్ మర్డర్ మిస్టరీని ఛేదించిన పోలీసులు… వివాహేతర సంబంధమే కారణం!

Crime News: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ జంట హత్య జరగడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ క్రమంలోనే పలు ఆధారాలను సేకరించిన పోలీసులు ఎట్టకేలకు ఈ కేసును ఛేదించి నిందితులను కనుగొన్నారు. చనిపోయింది జ్యోతి యశ్వంత్ అని గుర్తించిన పోలీసులు దొరికిన ఆధారాలతో టెక్నికల్ ఎవిడెన్స్ ఉపయోగించి ఎట్టకేలకు ఈ హత్యకు కారణమైన నిందితుడిని కనుక్కున్నారు. అయితే వీరిద్దరిని హత్య చేసింది జ్యోతి భర్త శ్రీనివాస్ అని పోలీసులు నిర్ధారించారు.

వారాసిగూడకు చెందిన యశ్వంత్ డ్రైవర్ గా పనులు చేస్తున్నారు.ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జ్యోతి గత కొన్ని రోజుల నుంచి యశ్వంత్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది.ఈ విషయం తెలిసిన ఆమె భర్త ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు తెలియజేశారు. ఆదివారం మధ్యాహ్నం తన సోదరుడి బైక్ తీసుకొని వెళ్ళిన యశ్వంత్ సాయంత్రం తిరిగి తన సోదరుడికి బైక్ ఇచ్చి వెళ్ళాడు. మరి తిరిగి ఇంటికి రాలేదు.

వృత్తిపరంగా యశ్వంత్ డ్రైవర్ కావడంతో కుటుంబ సభ్యులు కూడా పెద్దగా అతని గురించి పట్టించుకోలేదు. అయితే అదే సమయంలో జ్యోతి కూడా కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.ఇక వీరిద్దరి మధ్య ఉన్న వివాహేతర సంబంధం గురించి తెలిసిన శ్రీనివాస్ వీరిని దారుణంగా చంపి కంపచెట్లలో పడేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక జ్యోతి హ్యాండ్ బ్యాగ్ లో దొరికిన ఆధారాలతో వీరి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన పోలీసులు అనంతరం ఈ కేసు విచారణలో అసలు నిందితుడుని కనుగొన్నారు.