Power problems in hyderabad: భాగ్యనగరంలో ఈ రోజు ఈదురు గాలులతో కురిసిన వర్షానికి పలు చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. అయితే ఉదయం నుంచి కరెంటు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు పట్టణ వాసులు, అయితే చెట్లు కూలడం వల్లే విద్యుత్ సరపరాకు అంతరాయం ఏర్పడిందని దక్షిణ డిస్కం సీఎండీ రఘురామా రెడ్డి తెలిపారు. ఈ రోజు తెల్లవారుజామున నగరంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అయితే చాలా చోట్ల కరెంటు సమస్యలు ఉండటంతో రఘురామా రెడ్డి విద్యుత్ అధికారులతో ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది చెట్లను తొలగించి విద్యుత్ సరఫరా పునరుద్దరణ పనుల్లో ఉన్నారు. చెట్ల మీద వాహనాల మీద విద్యుత్ వైర్లు పడితే వాటిని తాకే ప్రయత్నం చేయొద్దని వివరించారు. రోడ్ల మీద నిల్వ ఉన్న నీళ్లలో విద్యుత్ వైర్లు గాని, ఇదర విద్యుత్ పరికరాలు మునిగి ఉంటే ఈ నీళ్లలోకి వెళ్లరాదని సూచించారు. అయితే విద్యుత్ సరఫరా సమస్యల పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఉన్నా 112/100/ స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ నంబర్లు 73820 72104, 73820 72106, 73820 71574లకు కాల్ చేసి ఫిర్యాదు చయొచ్చని రఘురామా రెడ్డి తెలిపారు.