...

Telugu Heroes Remuneration : మన స్టార్ హీరోల పారితోషకం వివరాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..! 

Telugu Heroes Remuneration : మన హీరోల పారితోషకం ఒకప్పుడు 15 కోట్ల వరకు వెళ్తేనే చాలా మంది అబ్బా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ లెక్క 50 కోట్లను దాటి 100 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. అంతలా మన హీరోల పారితోషకాలు పెరిగిపోయాయి. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా కొంత మంది హీరోలు తమ పారితోషకాల్ని అమాంతం పెంచేశారు. తమ మార్కెట్ ను నమ్మి సినిమాలు చేయాలని ప్రొడ్యూసర్లకు సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలుతున్న కొందరు బడా హీరోలు ఎంత తీసుకుంటున్నారనే విషయంపై ఓ సారి లుక్కేస్తే..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ తర్వాత సినిమాల ఎంపికలో స్పీడును పెంచారు. ఆయన ప్రస్తుతం చేస్తున్న హరిహర వీర మల్లు సినిమా కోసం ఏకంగా 60 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ప్రభాస్ విషయానికి వస్తే బాహుబలి సినిమాతో ఆయన గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. అందుకోసమే ఆయన ఇప్పుడు సినిమాకు 100 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తున్నాడట. ఈ లెక్కలను స్వయాన ప్రభాస్ పీఆర్ టీమే వెల్లడించింది. ఇక వరుసగా సినిమాలు చేస్తున్న మరో స్టార్ హీరో మహేశ్ బాబు తన తదుపరి చిత్రం సర్కారు వారి పాట కోసం 55 కోట్ల రూపాయలను పారితోషకంగా తీసుకుంటున్నాడట.

ఇక ట్రిపుల్ ఆర్ వంటి మూవీని చేస్తున్న ఎన్టీఆర్ 45 కోట్లు మరో హీరో రామ్ చరణ్ కూడా 45 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాకు ఆయన తనయుడే ప్రొడ్యూసర్ కాబట్టి లెక్కలు బయటకు తెలియడం లేదు. పుష్ప ది రైజ్ కోసం అల్లు అర్జున్ ఏకంగా 60 కోట్ల రూపాయలు తీసుకున్నాడట. మరో సీనియర్ హీరో బాలయ్య అఖండ సినిమా కోసం 11 కోట్లు వసూలు చేశాడని టాక్.
Read Also : SreeMukhi Chef Mantra : అది కావాలని శ్రియ సరన్ హాట్ కామెంట్స్.. నెట్టింట రచ్చ రచ్చ..