Pawan Kalyan : ‘చిరు’ సూపర్ హిట్ మూవీ రీమేక్‌లో తమ్ముడు ‘పవన్ కళ్యాణ్’.. అన్ని కుదిరితే ఫ్యాన్స్ పండగే!

Pawan Kalyan To Remake Chiranjeevi
Pawan Kalyan To Remake Chiranjeevi

Pawan Kalyan : చిరు తన కెరీర్ మొదట్లో చాలా మాస్ , కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు చేశారు.దాదాపు అన్నీ హిట్ అయ్యాయి. ఆ మాస్ సినిమాల క్రేజే నేడు చిరును టాలీవుడ్‌కు బిగ్‌బాస్‌ను చేశాయనడంలో అతిశయోక్తి లేదు. చిరు నటనా, మాస్ డ్యాన్స్, ఫైట్స్‌తో మాస్ ఆడియెన్స్‌ను తన వైపుకు తిప్పుకున్నారు. అయితే, ప్రస్తుతం చిరు సూపర్ హిట్ సినిమాలను రీమేక్ చేయాలని కొందరు దర్శకనిర్మాతలు భావిస్తున్నారట.. ఇక అందులోనూ మెగా హీరోలు పోటీ పడుతున్నారని టాక్. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాను రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. అప్పట్లో ఆ కథ చిరు నటించిన ‘మొగుడు కావాలి’ సినిమాది.

హీరో రామ్ చరణ్ కూడా చిరు సినిమాను రీమేక్ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారట. కానీ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడని తెలిసింది. ఇకపోతే వవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు చిరు ఓల్డ్ కంటెంట్ రీమేక్‌లో అవకాశం వచ్చిందని తెలుస్తోంది. ఆ పాత కథను నేటి తరానికి తగినట్టుగా స్క్రిప్ట్ మార్చాలని చూస్తున్నారట.. ఆ సినిమా మరేదో కాదు. దర్శకుడు కోదండ రామిరెడ్డి తెరకెక్కించిన ‘జేబుదొంగ’.. ఈ సినిమా మాస్ కమర్షియల్ హిట్. 1987లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. భాను ప్రియ, రాధ వంటి తారలు చిరుకు జోడిగా నటించారు.

Advertisement

జేబుదొంగ కథతో పవన్ హీరోగా మాస్  సినిమా తెరకెక్కించాలని ఓ అగ్ర నిర్మాత భావిస్తున్నారట.. దీనికి పవన్ కూడా ఓకే చెప్పారని టాక్. అందుకోసం రీమేక్ స్పెషలిస్టుగా పేరున్న ఓ డైరెక్టర్‌కు ఈ బాధ్యతలు అప్పగించాలని ఆ నిర్మాత అనుకుంటున్నారట. అన్ని అనుకున్నట్టు జరిగితే మెగాస్టార్ సినిమాలో పవర్ స్టార్ అంటూ మెగా అభిమానులు పండగ చేసుకుంటారు. కాగా, ప్రస్తుతం పవన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ‘అయ్యప్పునుమ్ కోషియుమ్’ మళయాల మూవీని ‘భీమ్లా నాయక్‌’తో పేరుతో రీమేక్ చేస్తుండగా.. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’, హరీష్ శంకర్ ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమాలతో పవర్ స్టార్ బిజీగా మారిపోయారు.
Read Also  : Samantha : విడాకుల తర్వాత.. సమంత క్రేజ్ మరింత పెరిగిపోయిందిగా…! హ్యాట్సాఫ్ సామ్!

Advertisement