...

Pawan Kalyan : వైసీపీకి ఇచ్చిన గడువు ముగిసింది.. పవన్ నెక్ట్స్ స్టెప్ ఏంటి?

Pawan Kalyan : ఒక వైపు సినిమాల్లో బిజీగా ఉంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మరో వైపు ఏపీ పాలిటిక్స్ పై చాలా సీరియస్‌గా ఫోకస్ చేస్తున్నారు. అక్టోబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లో చాలా టూర్స్ వేసిన ఆయన.. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. మరో వైపు ఆయన పొలిటికల్ షెడ్యూల్ నవంబర్‌లో చాలా బిజీగా ఉంది.
పోయిన నెల 31వ తేదీన విశాఖలో సభ నిర్వహించారు. అందులో ఏపీ సర్కారుకు ఆయన డెడ్ లైన్ విధించారు. వారంలోపు అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని లేదంటే తమ యాక్షన్ ప్లాన్ చూపిస్తామంటూ హెచ్చరించారు. ప్రస్తుతం ఆ టైం దాటిపోవడంతో పవన్ నెక్ట్స్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారోనని అందరిలో ఆసక్తి నెలకొంది.
అయితే అఖిలక్ష సమావేశం ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నదా? లేదా? అనేది ప్రశ్న. పవన్‌కళ్యాణ్ చేసిన డిమాండ్‌ విషయంపై పలువురు మినిస్టర్స్ విమర్శలను గుప్పించారు. కానీ అఖిలపక్షం మీటింగ్ కు సంబంధించిన విషయాలను ప్రస్తావించలేదు. పైగా పవన్‌కళ్యాణ్‌కు సత్తా ఉంటే ప్రధాని మోడీకి డెడ్‌లైన్ పెట్టాలంటూ మంత్రి కొడాల నాని సీరియస్ అయ్యారు.
దీంతో తన పొలిటికల్ మార్పును చూపించేందుకు  రెడీ అవుతున్నారని టాక్. గతంలో రెండేండ్ల కిందట పవన్‌కళ్యాణ్ ఆధ్వర్యంలో ఇసుక కొరతపై లాంగ్‌మార్చ్ చేపట్టారు. ఇందుకు స్పందన సైతం బాగానే వచ్చింది. ఇప్పుడు సైతం అదే మాదిరి లాంగ్‌మార్చ్ నిర్వహిస్తారా? అనే చర్చ కొనసాగుతోంది.
అయితే ఈ సారి విపక్షాలను సైతం కలుపుకొని ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టేందుకు జనసేన ప్లాన్ చేస్తున్నదని ప్రచారం జరుగుతోంది. స్టీల్ ప్లాంట్ విషయంలో ఆయన ఇలాగే ముందుకు వెళ్తే ఆయనకు మరింత పొలిటికల్ మైలేజ్ పెరుగుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
Read Also : AP Legislative Council : ఏపీలో మండలికి అడుగు పెట్టేది వారే..