...

Sarkaru vaari paata: సర్కారు వారి పాట సెన్సార్ రివ్యూ వచ్చేసింది

Sarkaru vaari paata: సూపర్ స్టార్ మహేశ్ బాబు, డైరెక్టర పరశురామ్ కాంబినేషన్ లో వస్తోన్న మూవీ ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రంలో మహేశ్ కు జంటగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మే 12న విడుదల కానుంది. ఈ సినిమా కోసం అటు మహేశ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను రికార్డు స్థాయి స్క్రీన్లలో రిలీజ్ చేయనున్నారని సమాచారం.

Advertisement

తాజాగా ‘సర్కారు వారి పాట’ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ టాక్ ప్రస్తుతం టాలీవుడ్ లో, నెట్టింట్లో వైరల్ గా మారింది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీకి సెన్సార్ యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ మూవీ 2 గంటల 42 నిమిషాల 09 సెకన్ల నిడివి ఉంది. ఇందులో మహేశ్ యాక్టింగ్ ఇరగదీసినట్లు టాక్ వస్తోంది.

Advertisement

Advertisement

ఈ సినిమా మాస్ అండ్ క్లాస్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చే విధంగా తెరకెక్కించారంట. సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు పంచ్ డైలాగ్స్ పవర్ ఫుల్ గా పేలాయని ఇంటర్వెల ట్విస్ట్ ప్రేక్షకులకు మైండ్ బ్లాంక్ అయ్యే విధంగా ఉంటుందని సమాచారం.

Advertisement

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కొత్త సినిమాలేవీ లేవు. అప్పట్లో విడుదలైన ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 మాత్రమే విజయవంతంగా ప్రదర్శితమవుతున్నాయి. ఈ మధ్యే వచ్చిన ఆచార్య చిత్రం ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో ఇప్పుడు మహేశ్ సినిమాకు ఏ అడ్డంకి లేదనే చెప్పాలి. సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకు ‘సర్కారు వారి పాట’ సినిమానే మొదటి ఆప్షన్ అవుతుందని అంటున్నారు.

Advertisement
Advertisement