...

RRR Movie Pre Release : ఏరియాల వారిగా ‘ఆర్ఆర్ఆర్‌’ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇదిగో…

RRR Movie Pre Release : గత రెండు మూడు సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా మార్చి 25 వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ఒక హాలీవుడ్ సినిమా రేంజ్ లో విడుదలకు సిద్ధమవుతోంది. అమెరికాలో ఈ సినిమా హాలీవుడ్ సినిమాల వసూళ్లను కూడా బీట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ప్రీమియర్ షోలకు రెండు మిలియన్ల డాలర్ల అడ్వాన్స్ బుకింగ్ జరిగింది అంటూ వార్తలు వస్తున్నాయి. విడుదల సమయానికి ఆ మొత్తం రెండున్నర మిలియన్ల డాలర్ల కు చేరినా కూడా ఆశ్చర్యం లేదు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా రెండు రోజుల క్రితం అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. సాధారణంగానే రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్ లు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉంటాయి. ఈ సినిమా కు అంతకు రెండింతల అడ్వాన్స్ బుకింగ్‌ జరుగుతోంది.

RRR-movie pre release business
RRR-movie pre release business

ఇద్దరు స్టార్ హీరోల సినిమా అవడంతో డబుల్ అడ్వాన్స్ బుకింగ్ లు నడుస్తున్నాయి. దేశం మొత్తం మీద ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా గురించి చర్చ జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు ది కశ్మీర్‌ ఫైల్స్ సినిమా గురించిన ప్రచారం జరిగినా… ఇప్పుడు ఆ సినిమా కు మెల్ల మెల్లగా క్రేజ్ తగ్గి ఆర్ ఆర్‌ ఆర్ సినిమా గురించిన వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.

ఇంత భారీ అంచనాలున్న ఈ సినిమా ఎన్ని కోట్ల బిజినెస్ చేసింది.. ఏ ఏరియాలో ఎంత మొత్తానికి అమ్ముడైంది అనే విషయాల పై ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి ఉంది. ఆ విషయం పై చిత్ర యూనిట్ సభ్యులు మరియు బాక్సాఫీస్‌ వర్గాల వారి నుండి మాకు అందుతున్న సమాచారం ప్రకారం ఆ లెక్కలు ఇవే..

నైజాం : రూ. 70 కోట్లు
సీడెడ్ : రూ. 37 కోట్లు
ఉత్తరాంధ్ర : రూ. 22 కోట్లు
ఈస్ట్ : రూ. 14 కోట్లు
వెస్ట్ : రూ. 12 కోట్లు
గుంటూరు : రూ. 15 కోట్లు
కృష్ణ : రూ. 13 కోట్లు
నెల్లూరు : రూ. 8 కోట్లు
కర్ణాటక : రూ. 41 కోట్లు
తమిళనాడు : రూ. 35 కోట్లు
కేరళ : రూ. 9 కోట్లు
హిందీ : రూ. 91 కోట్లు
దేశంలో ఇతర..  రూ. 8 కోట్లు
ఓవర్శిస్ : రూ. 75 కోట్లు
మొత్తం బిజినెస్‌ : రూ. 451 కోట్లు

Read Also : RRR Movie : ఆర్ఆర్ఆర్ సినిమాకు కశ్మీర్ ఫైల్స్‌తో ఇబ్బంది లేదు.. ఎలాగంటే!