...

RRR Fans : అభిమానుల ఆగడాలకు హద్దు లేకుండా పోయింది… ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ మధ్య బిగ్ ఫైట్..!

RRR Fans : ఒకవైపు తెలుగు ప్రేక్షకులు రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్‌ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆనందంలో ఉండగా.. మరో వైపు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ అభిమానులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ సోషల్ మీడియా లోనే కాకుండా థియేటర్ల వద్ద కూడా హడావిడి చేస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను రామ్ చరణ్ అభిమానులు అలాగే రామ్‌ చరణ్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎన్టీఆర్ అభిమానులు తొలగిస్తూ వివాదాలను రాజేసి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ వివాదాలు సినిమా విడుదలయ్యే సమయానికి రచ్చ రచ్చగా మారే అవకాశాలు ఉన్నాయంటూ సినీ విశ్లేషకులు మరియు మీడియా వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినిమా కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నా రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు ఈ విషయమై స్పందించాలని సినీ ప్రేమికులు ఇప్పటికే కోరుకుంటున్నారు.

rrr-fans-rrr-movie-ram-charan-and-ntr-fans-fighting
rrr-fans-rrr-movie-ram-charan-and-ntr-fans-fighting

అమెరికాతో పాటు ఇతర దేశాల్లో మరియు మన దేశంలో కూడా రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఫ్యాన్స్ విడి విడిగా పోటా పోటీగా సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తూ హోర్డింగులు ఏర్పాటు చేస్తూ తమ హీరో గొప్ప గొప్ప అంటూ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

విడుదల తేదీ సమీపిస్తున్నకొద్దీ ఈ రచ్చ మరింతగా పెరుగుతూనే ఉంది. సినిమా రిలీజ్ రోజు కచ్చితంగా ఒక రేంజ్ లో గొడవలు జరుగుతాయి అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సినిమా థియేటర్ల వద్ద పోలీసులను ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది. కచ్చితంగా ఈ సినిమా ఆడుతున్న ప్రతి ఒక్క థియేటర్ వద్ద పోలీసులు ఉండాల్సిందే అనే పరిస్థితి రావచ్చు అంటూ మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు హీరోల అభిమానుల ఆగడాలకు హద్దే లేకుండా పోయింది అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Read Also RRR Movie Pre Release : ఏరియాల వారిగా ‘ఆర్ఆర్ఆర్‌’ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇదిగో…