Guppedantha Manasu: వసు గురించి ఆలోచనలో పడ్డ రిషి.. కొత్త ఇంట్లో వసు..?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంతమనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి,వసు భోజనం చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు.

ఈ రోజు ఎపిసోడ్ లో వసు,రిషి గురించి మాట్లాడుతూ మీరు తీసుకున్న నిర్ణయం వల్ల నాకు చాలా మంచి జరిగింది సార్ అని రిషితో అనగా అప్పుడు రిషి కానీ నువ్వు ఒంటరి అయ్యావు కదా అని అంటాడు. అప్పుడు వసు సార్ నేను ఒకటి అడుగుతాను చెప్తావా అని అడగగా అప్పడు రిషి అడుగు అని అంటాడు.

Advertisement

అప్పుడు వసు ఎందుకు సార్ నేను అంటే మీకు అంత శ్రద్ధ అని అడుగుతుంది. అంతేకాకుండా ఎందుకు నేను అంటే మీకు అంత స్పెషల్ ఇంట్రెస్ట్ అని అడగగా అప్పుడు వెంటనే రిషి నువ్వు ఎందుకు నా మీద అంత శ్రద్ధ చూపిస్తున్నావు అని అడగగా మీరు జగతి మేడమ్ గారి అబ్బాయి కదా సార్ అని అంటుంది.
వీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా జగతి మహేంద్ర చాటుగా వింటూ ఉంటారు.

అప్పుడు రిషి మాట్లాడుతూ నువ్వు అందరిలాంటి అమ్మాయి కాదు అందుకే నువ్వు అందరికీ బాగా నచ్చుతాయి నాకు కూడా నచ్చావు అని అనడంతో జగతి మహేంద్ర లు ఆనందంతో పొంగిపోతూ ఉంటారు. అందుకే నేను నిన్ను అసిస్టెంట్ గా సెలక్ట్ చేసుకున్నాను అని అంటాడు రిషి. ఇక అప్పుడు మహేంద్ర జగతి లు అక్కడినుంచి ఆనందంగా వెళ్ళి పోతారు.

Advertisement

మరొకవైపు గౌతమ్ వసు ని ఏంజెల్ అంటే పొగుడుతూ ఉంటాడు. అప్పుడు రిషి వసు ని ఏంజెల్ అని ఫీల్ అవ్వకు అనే వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత వసు తాను పనిచేసే రెస్టారెంట్ పైన రూమ్ తీసుకోని ఉంటుంది. అక్కడికి జగతి, మహేంద్ర లను వెళ్లి వసు పరిస్థితి చూసి బాధపడుతూ ఆమెకు జాగ్రత్తలు చెబుతారు.

మరొక వైపు రిషి,వసు కీ జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతారు. మరొకవైపు వసు గురించి రిషి ఆలోచిస్తూ బాధపడుతు ఉంటాడు. ఇక తరువాయి భాగంలో రిషి వసుకు ఫోన్ చేసి ఫోన్ ఆన్సర్ చేయనందుకు ఎంత టెన్షన్ పడ్డాడో చెబుతాడు. ఇక అంతే కాకుండా వసు రూమ్ దగ్గరికి వెళ్ళి వసు కీ సర్ప్రైస్ ఇస్తాడు.

Advertisement