...

Guppedantha Manasu: గౌతమ్ ప్లాన్ ను చెడగొట్టిన రిషి.. వసు ఏం చేయనుంది..?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..రిషి తన బెడ్ రూమ్ లో కూర్చొని వసు గురించి ఆలోచిస్తాడు.

Advertisement

ఈరోజు ఎపిసోడ్ లో రిషి,వసు గురించి ఆలోచిస్తూ ఎందుకు నేను వసు విషయంలో ఇంతగా శ్రద్ధ చూపిస్తున్నాను. నాకు వసు కు మధ్య ఉన్న సంబంధం ఏంటి అదే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో జగతి, మహేంద్ర ఇంటికి రావడంతో వారితో పాటు వసు వచ్చిందేమో అని రిషి వెళ్ళి చూస్తాడు. ఇక వసు రాకపోవడంతో రిషి కొంచెం విచారం వ్యక్తం చేస్తాడు.

Advertisement

Advertisement

అప్పుడు మహేంద్ర రిషి ఎందుకోసం ఎదురుచూస్తున్నాడో తెలుసుకొని రిషిని ఆటపట్టిస్తూ ఉంటాడు. ఆ తర్వాత మహేంద్ర, వసు ఎక్కడఉందో తన లొకేషన్ ను రిషి కీ షేర్ చేస్తాడు. ఇక మరొక వైపు రిషి ఎన్ని సార్లు ఫోన్ చేసిన వసు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం తో కోప్పడతాడు. ఆ తర్వాత మహేంద్ర చెప్పిన అడ్రస్ కు వెళ్లి వసు కీ షాక్ ఇస్తాడు రిషి.

Advertisement

అక్కడ వసు రూమ్ చూసి కొంత బాధను విచారం వ్యక్తం చేస్తాడు రిషి. అలా వారు మాట్లాడుతూ ఉండగా ఇంతలో కరెంటు పోతుంది. మరొకవైపు జగతి,రిషి ఇంకా ఇంటికి రాలేదు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో మహేంద్ర,రిషి కీ ఫోన్ చేసి మీ స్పెషల్ స్టూడెంట్ కు ఏమైనా స్పెషల్ క్లాసులు తీసుకుంటున్నావా అని కామెడీగా అడుగుతాడు.

Advertisement

అప్పుడు ఏం మాట్లాడుతున్నారు డాడ్ అని అనగా ఏమీ లేదులే నేను చెప్పే మాటలు నీకు అర్థం కాకపోయినా కనీసం నీ క్లాసు అయిన అర్థమయ్యే విధంగా వసుకీ చెప్పు అని చెప్పీ ఫోన్ కట్ చేస్తాడు మహేంద్ర. రేపటి ఎపిసోడ్ లో భాగంగా గౌతం వసు దగ్గరికి వచ్చి గులాబీ పువ్వు ఇచ్చిన ఐ లవ్ యూ అని చెప్పబోతుండగా ఇంతలో ఆ రోజ్ ఫ్లవర్ ను కట్ చేస్తాడు. దీంతో గౌతమ్ ఫుల్ గా డిసప్పాయింట్ అవుతాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement
Advertisement