Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో వసు, రిషి ని తన ఇంటి వద్దకు రావద్దు అని చెప్పి ముఖం మీద తలుపులు వేస్తుంది.
ఈ రోజు ఎపిసోడ్ లో రిషి బాధపడుతూ ఉండగా ఇంతలో మహేంద్ర వచ్చి ఓదారుస్తాడు. ఈ లేనిపోని చిక్కులు ఎందుకు పెట్టుకుంటారు రిషి అంటూ ప్రశ్నిస్తాడు. అంతేకాకుండా ఎప్పుడూ లేనిది ఎందుకు ఈ బాధ అని అడుగుతాడు. అప్పుడు మనసులో రిషి, ముఖం పై తలుపు ఎందుకు వేసిందో వసు మాత్రమే చెప్పగలదు అని అనుకుంటూ ఉంటాడు.
అప్పుడు మీ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం చెబుతాను డాడ్ మీరు వెళ్లిపోండి అని అనడంతో మహేంద్ర అక్కడనుంచి వెళ్ళి పోతాడు. ఆ తర్వాత అది ఒక్కడే బాధపడుతూ ఉంటాడు. మరొకవైపు వసు జరిగిన విషయం గురించి బాధపడుతూ కుమిలిపోతూ ఉంటుంది.
నా వల్ల రిషి సార్ ఎంత బాధ పడ్డాడో అని బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు రిషి ఒంటరిగా కూర్చొని నాకు ఏమయింది. ఎందుకు వసు గురించి నేను ఇంతలా ఆలోచిస్తున్నాను.. అని అనుకుంటూ ఉండగా మరొక వైపు మహేంద్ర, జగతి లు కూడా జరిగిన విషయం గురించి గురించి బాధ పడుతూ ఉంటారు.
ఇక మరుసటి రోజు ఉదయం గౌతమ్ ఫుల్ గా రెడీ అవగా ఇంతలో అక్కడికి వచ్చిన రిషి ఎక్కడికి వెళ్తున్నావ్ రా అని అడగగా ఈరోజు నా మనసులోని మాటను వసు తో చెప్పేయాలి అనుకుంటున్నాను అని రిషితో అనడంతో అప్పుడు రిషి కూడా చెప్పమంటూ ప్రోత్సహిస్తాడు.
అప్పుడు గౌతమ్,రిషి లో వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపోతాడు..కానీ రిషి మాత్రం ఈసారైనా వసు మనసులో ఏముందో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత వసు దగ్గరికి వెళ్లిన గౌతమ్, రిషి గీసిన బొమ్మను ఇచ్చి నీకు ఒక మాట చెప్పాలి అని చెప్పి ఐ లవ్ యు వసు అని అనడంతో వసు ఒక్కసారిగా షాక్ అవుతుంది.
అప్పుడు గౌతమ్ నిజం నువ్వంటే నాకు చాలా ఇష్టం అని మాట్లాడుతూ ఉండడంతో అవన్నీ కూడా కొంచెం దూరం నుంచి రిషి వింటూ ఉంటాడు. అప్పుడు వసు నా బొమ్మను ఇంత బాగా గీసింది ఎవరు అని అడగగా అది నువ్వే తెలుసుకో అని పరీక్ష పెడతాడు గౌతమ్. ఆ తరువాత తన రూమ్ కి వెళ్లిన వసు ఆ బొమ్మను ఎవరు గీశారు అని ఆలోచిస్తూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World