...

Pooja Utensils : హిందువుల పూజా కార్యక్రమాల్లో రాగి పాత్రలనే ఎక్కువగా ఎందుకు వాడతారో తెలుసా ?

Pooja Utensils : సాధారణంగా హిందువుల ఆచారం ప్రకారం పూజ కార్యక్రమాలు నిర్వహించడం అందరికీ తెలిసిందే. పండుగను బట్టి, సంధర్భాన్ని బట్టి వారు పలు రకాల పూజలు చేస్తూ ఉంటారు. అయితే మనం బాగా గమనించినట్లైతే పూజ చేసేటప్పుడు ఎక్కువగా రాగితో చేసిన పూజా సామాగ్రిని ఉపయోగిస్తుంటారు. అయితే ఈ విధంగా రాగి పాత్రలను వినియోగించడం వెనుక ఒక స్టోరీ ఉందని తెలుసా… అవును. రాగి సామగ్రిని వినియోగించడానికి గల కారణాలను అప్పటి వరాహ పురాణంలోనే వరాహస్వామి భూదేవికి వివరించినట్టు చెబుతారు.

reasons-behind-using-copper-items-for-pooja-in-indu-tradition
reasons-behind-using-copper-items-for-pooja-in-indu-tradition

వరాహ పురాణం ప్రకారం చూస్తే.. కొన్ని యుగాల క్రితమే గుడాకేశుడు అనే పిలిచే రాక్షసుడు మహా విష్ణువుకి భక్తితో తపస్సు చేశాడట.. ఆ రాక్షసుడు తపస్సుకు ఎంతో మెచ్చిన మహా విష్ణువు ప్రత్యక్షమయ్యాడు.. నీకు ఏమి వరం కావాలో కోరుకోవాలని అడిగాడు. అందుకు ఆ గుడాకేశుడు తన దేహాన్ని సుదర్శన చక్రంతో ఖండించాలని అడిగాడట.. భగవంతునిలో ఐక్యం చేసుకోవాలని కోరాడు. ఆ రాక్షసుడు తన శరీరంతో తయారైన ఆ సామాగ్రిని పూజా సమయంలో వినియోగించుకోవాలని ఆ దేవున్ని కోరాడట.

ఈ మేరకు విష్ణువు వైశాఖ శుక్లపక్ష ద్వాదశి రోజున నీ కోరిక తీరుతుందని చెబుతారు. గుడాకేశుడు కోరినట్టుగా రాగి పాత్రలను పూజా సమయంలో వినియోగించుకోవాలని మహా విష్ణువు భక్తులను ఆదేశిస్తాడు. అప్పటి నుంచి రాగి వస్తువులను వాడటం ఆచారంగా వస్తోందని తెలుస్తుంది. రాగి పాత్రలు కూడా ఎంతో శుభ సూచకమని చెబుతారు. అందుకే ఎక్కువగా వాటిని వినియోగించడం జరుగుతుంది. ప్రస్తుత రోజుల్లో రాగి పాత్రలను బాటిల్స్ కూడా ఎక్కువగా రాగిలోనే వస్తున్నాయి. అందరూ ఎక్కువగా ఈ రాగి వస్తువులనే అధికంగా వాడేందుకు ఇష్టపడుతున్నారు.

Read Also : Shani dev : శనిదేవుడి ఆరాధనలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. అప్పుడే లాభాలు!