Lord Shiva Worship : హిందూ మతంలో చాలామంది సోమవారం శివారాధన చేస్తారు. దేవతల దేవుడిగా పిలువబడే మహాదేవుడు చాలా సరళుడు, అమాయకుడు అందుకే అతడిని భక్తులు భోలేనాథ్ అని పిలుస్తారు. శివుని ఆరాధన ఏ రోజున ఏ సమయంలోనైనా చేయవచ్చు అయితే సోమవారం శివారాధనకు ప్రత్యేకంగా అంకితం చేశారు. అంతేకాదు సోమవారం శివుడిని పూజించిన వెంటనే అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. శివుని ఆరాధనకు సంబంధించిన కొన్ని సాధారణ చర్యల గురించి తెలుసుకుందాం.
మీ జాతకంలో శని దోషం ఉంటే జీవితంలో అన్ని రకాల సమస్యలు ఎదురవుతాయి. అప్పుడు శివారాధన మీకు ఒక వరం కంటే తక్కువేమి కాదు. శని దోషాన్ని తొలగించడానికి ప్రతిరోజూ రాగి పాత్రతో శివలింగానికి జలాభిషేకం చేయాలి. రుద్రాక్షతో కూడిన జపమాలతో శివుని మంత్రాన్ని జపించాలి. అలానే మీరు ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే చికిత్స తర్వాత కూడా నయం కాకుంటే మృత్యుంజయ శివుడిని ఆరాధించాలి.
శివుని అనుగ్రహం పొందడానికి కొన్ని పాలు, నల్ల నువ్వులను నీటిలో కలిపి సోమవారం శివలింగానికి సమర్పించాలి. ఈ పరిహారంతో పాటు మహామృత్యుంజయ మంత్రాన్ని కనీసం 11 రౌండ్లు జపించాలి. ఈ పరిహారాన్ని భక్తిశ్రద్ధలతో చేయడం వల్ల మీకు త్వరలో మంచి ఆరోగ్యం లభిస్తుంది.
మీ వివాహానికి తరచుగా అడ్డంకులు ఎదురవుతున్నట్లయితే లేదంటే వివాహం కుదిరిన తర్వాత చెడిపోతుంటే మీరు ప్రతి సోమవారం కుంకుమ కలిపిన నీటితో శివలింగానికి జలాభిషేకం చేయాలి. ఈ పరిహారం చేయడం వల్ల మీ సమస్యలు తొలగిపోయి మీకు కావలసిన జీవిత భాగస్వామి లభిస్తారు.
Read Also : Crime News : అర్ధరాత్రి ఎక్సర్ సైజ్ చేయొద్దన్నందుకు… కన్న తల్లిని కడతేర్చిన కొడుకు !
Tufan9 Telugu News And Updates Breaking News All over World